Telugu Global
NEWS

డిసెంబర్ 26న మళ్లీ వస్తా... మూడేళ్లలో కల నిజం చేస్తా....

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కరువును పారద్రోలేందుకు గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తీసుకొస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి . ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందన్నారు. ఎగువన ప్రాజెక్టులు కట్టడంతో కృష్ణా జలాలు కిందకు రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను తెచ్చి రాయలసీమ, ప్రకాశం జిల్లాలను కాపాడుతామన్నారు. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. తాను కరువు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినని… ప్రాజెక్టులు, […]

డిసెంబర్ 26న మళ్లీ వస్తా... మూడేళ్లలో కల నిజం చేస్తా....
X

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కరువును పారద్రోలేందుకు గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తీసుకొస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి . ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందన్నారు. ఎగువన ప్రాజెక్టులు కట్టడంతో కృష్ణా జలాలు కిందకు రావడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో గోదావరి జలాలను తెచ్చి రాయలసీమ, ప్రకాశం జిల్లాలను కాపాడుతామన్నారు. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. తాను కరువు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినని… ప్రాజెక్టులు, నీటి విలువ తెలిసిన వ్యక్తిని తానన్నారు.

మార్కెట్ యార్డులకు ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమిస్తామన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్‌ కూడా ఉంటారన్నారు. ఎమ్మెల్యేలు మార్కెట్ యార్డులను పరిశీలించి అవసరమైన సూచనలను ప్రభుత్వానికి అందజేస్తారని ముఖ్యమంత్రి చెప్పారు.

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కలగా మిగిలిపోయిందన్నారు. రాజకీయాల వల్ల స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయిందన్నారు. కలగా మిగిలిపోయిన ఈ ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న తిరిగి శంకుస్థాపన చేస్తానని జగన్ ప్రకటించారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసి చూపిస్తానన్నారు. జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో జగన్ ప్రసంగించారు.

First Published:  8 July 2019 4:31 AM GMT
Next Story