Telugu Global
Cinema & Entertainment

ట్రైలర్ తో కూడా వివాదం సృష్టిస్తున్న అమలాపాల్

తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అమలాపాల్. ‘రఘువరన్ బీటెక్’ వంటి డబ్బింగ్ సినిమాల తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన అమలాపాల్ తాజాగా తమిళంలో ‘ఆడయి’ అనే సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సినిమా ‘ఆమె’ అనే టైటిల్ తో తెలుగు లో కూడా విడుదల కాబోతుంది. కామిని అనే ఒక ఇండిపెండెంట్ మహిళ పాత్రలో అమలాపాల్ ఈ సినిమాలో కనిపించబోతోంది. రత్న కుమార్ దర్శకత్వం వహిస్తున్న […]

ట్రైలర్ తో కూడా వివాదం సృష్టిస్తున్న అమలాపాల్
X

తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అమలాపాల్. ‘రఘువరన్ బీటెక్’ వంటి డబ్బింగ్ సినిమాల తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన అమలాపాల్ తాజాగా తమిళంలో ‘ఆడయి’ అనే సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సినిమా ‘ఆమె’ అనే టైటిల్ తో తెలుగు లో కూడా విడుదల కాబోతుంది. కామిని అనే ఒక ఇండిపెండెంట్ మహిళ పాత్రలో అమలాపాల్ ఈ సినిమాలో కనిపించబోతోంది. రత్న కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు మరియు టీజర్ వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ లో కూడా ఒక అంశం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ట్రైలర్లో ఒక సన్నివేశంలో అమలాపాల్ విజే రమ్య ని ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తుంది. దీంతో సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం పై చర్చ మొదలైంది.

ప్రమోషనల్ కంటెంట్ తోనే వివాదాలను సృష్టిస్తున్న ఈ సినిమా విడుదలయ్యాక మరిన్ని వివాదాలు సృష్టిస్తుందని కొందరు అంటున్నారు. విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 19న విడుదల కాబోతోంది.

First Published:  8 July 2019 5:03 AM GMT
Next Story