Telugu Global
NEWS

పప్పులో కాలేసిన నారా లోకేష్

నారా లోకేష్‌ మరోసారి పప్పులో కాలేశారు. రాష్ట్రంలో విత్తనాల కొరతపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించబోయి అడ్డంగా దొరికిపోయారు. కొన్ని నెలల ముందు నుంచే వేరుశనగ విత్తన సేకరణ చేయాల్సి ఉన్నా… ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆ అంశాన్ని పట్టించుకోలేదు. పరిస్థితిని అధిగమించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నారా లోకేష్‌ మాత్రం విత్తన కొరతను ప్రస్తుత ప్రభుత్వం తీర్చలేకపోతోందని విమర్శిస్తున్నారు. అంతటితో ఆగకుండా తన ట్విట్టర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి విత్తనాలు కొనుగోలు చేసి అక్కడి […]

పప్పులో కాలేసిన నారా లోకేష్
X

నారా లోకేష్‌ మరోసారి పప్పులో కాలేశారు. రాష్ట్రంలో విత్తనాల కొరతపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించబోయి అడ్డంగా దొరికిపోయారు. కొన్ని నెలల ముందు నుంచే వేరుశనగ విత్తన సేకరణ చేయాల్సి ఉన్నా… ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆ అంశాన్ని పట్టించుకోలేదు. పరిస్థితిని అధిగమించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

నారా లోకేష్‌ మాత్రం విత్తన కొరతను ప్రస్తుత ప్రభుత్వం తీర్చలేకపోతోందని విమర్శిస్తున్నారు. అంతటితో ఆగకుండా తన ట్విట్టర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి విత్తనాలు కొనుగోలు చేసి అక్కడి రైతులకు సరఫరా చేస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం సొంత రైతులకు విత్తనాలు ఇవ్వలేకపోతోందని విమర్శించబోయారు.

ఇందుకు ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా జోడించారు నారా లోకేష్. సదరు పత్రిక కథనంలో ఏపీ నుంచి ఎంటీయూ-1001 రకం విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఉంది.

ఇక్కడే లోకేష్ దొరికిపోయారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నది వేరుశనగ విత్తనాల కొరత మాత్రమే. వరి విత్తనాల కొరత కాదు. లోకేష్ తన ట్విట్టర్‌లో ఉంచిన పత్రిక క్లిప్పింగ్‌లో చెప్పిన ఎంటీయూ -1001 రకం అన్నది వేరుశనగ విత్తనాలకు సంబంధించినది కాదు. ఎంటీయూ-1001 అనేది వరి వంగడం.

కానీ లోకేష్‌ మాత్రం ఎంటీయూ-1001 రకం అంటే వేరుశనగ విత్తనాలే అనుకొని…. ఏపీకి చెందిన విత్తనాలను తెలంగాణలో పంచుతున్నారని ప్రచారం చేయబోయారు.

కానీ నెటిజన్లు ఈ విషయాన్ని వెంటనే పసిగట్టారు. లోకేష్‌ను ఎప్పటి లాగే ట్రోల్ చేస్తున్నారు. వేరు శనగ విత్తనాలకు, వరి వంగడాలకు తేడా తెలియదా? లోకేష్ అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  6 July 2019 10:05 PM GMT
Next Story