Telugu Global
NEWS

2003 లో సచిన్... 2019లో షకీబుల్

7 హాఫ్ సెంచరీలతో సచిన్ సరసన షకీబుల్  606 పరుగులు, 11 వికెట్ల ఏకైక ఆల్ రౌండర్ షకీబుల్ 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను…బంగ్లాదేశ్ సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ రికార్డుల మోతతో ముగించాడు. క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా పాకిస్థాన్ తో జరిగిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో సైతం షకీబుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి ఆల్ రౌండర్ షకీబుల్… ప్రపంచకప్ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో..500 పరుగులు, 10 వికెట్లు […]

2003 లో సచిన్... 2019లో షకీబుల్
X
  • 7 హాఫ్ సెంచరీలతో సచిన్ సరసన షకీబుల్
  • 606 పరుగులు, 11 వికెట్ల ఏకైక ఆల్ రౌండర్ షకీబుల్

2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను…బంగ్లాదేశ్ సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ రికార్డుల మోతతో ముగించాడు. క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా పాకిస్థాన్ తో జరిగిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో సైతం షకీబుల్ హాఫ్ సెంచరీ సాధించాడు.

తొలి ఆల్ రౌండర్ షకీబుల్…

ప్రపంచకప్ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో..500 పరుగులు, 10 వికెట్లు సాధించిన ఏకైక ఆల్ రౌండర్ గా షకీబుల్ హసన్ చరిత్ర సృష్టించాడు.

మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో బంగ్లాజట్టులో సభ్యుడిగా తొమ్మిది మ్యాచ్ లు ఆడిన షకీబుల్ 600కు పైగా పరుగులతో పాటు..11 వికెట్లు సైతం పడగొట్టాడు.

సచిన్ సరసన షకీబుల్…

ప్రస్తుత ప్రపంచకప్ లో షకీబుల్ 66, 51, 41, 121, 64, 75, 64 స్కోర్లతో సహా…మొత్తం 606 పరుగులు సాధించాడు. గత ప్రపంచకప్ టోర్నీలలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, మాథ్యూ హేడెన్ లకు మాత్రమే 600కు పైగా స్కోర్లు సాధించిన రికార్డు ఉంది.

అంతేకాదు…ప్రపంచకప్ టోర్నీలో ఏడు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ ఘనత మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు ఉంది. 2003 ప్రపంచకప్ లో సచిన్ ఏడు హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 673 పరుగులు సాధిస్తే..ప్రస్తుత 2019 ప్రపంచకప్ లో షకీబుల్ 606 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.

First Published:  5 July 2019 8:45 PM GMT
Next Story