Telugu Global
NEWS

చంద్రబాబు అండతో లింగమనేని 250 కోట్లు ఎగ్గొట్టాడు

రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండతో లింగమనేని రమేష్ కంపెనీ ఎన్నో భూనేరాలకు పాల్పడిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి, పంచాయతీలకు వందల కోట్ల మేర నష్టం చేకూర్చారన్నారు. మంగళగిరి మండలం కాజ గ్రామంతో పాటు, పొన్నూరు నియోజక వర్గంలోని నంబూరు, తాడికొండ నియోజక వర్గంలోని కంతేరు గ్రామాల్లో ఐజేఎం- లింగమనేని సంస్థలు చట్ట విరుద్దంగా విల్లాలు కట్టి అమ్మకాలు జరిపారని ఆర్కే వివరించారు. గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే … సదరు రియల్ […]

చంద్రబాబు అండతో లింగమనేని  250 కోట్లు ఎగ్గొట్టాడు
X

రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండతో లింగమనేని రమేష్ కంపెనీ ఎన్నో భూనేరాలకు పాల్పడిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి, పంచాయతీలకు వందల కోట్ల మేర నష్టం చేకూర్చారన్నారు. మంగళగిరి మండలం కాజ గ్రామంతో పాటు, పొన్నూరు నియోజక వర్గంలోని నంబూరు, తాడికొండ నియోజక వర్గంలోని కంతేరు గ్రామాల్లో ఐజేఎం- లింగమనేని సంస్థలు చట్ట విరుద్దంగా విల్లాలు కట్టి అమ్మకాలు జరిపారని ఆర్కే వివరించారు.

గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే … సదరు రియల్ ఎస్టేట్ భూమిలో 10 శాతం భూమిని పంచాయతీ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని పంచాయతీ రాజ్ యాక్ట్-1994 స్పష్టంగా చెబుతోందన్నారు. మంగళగిరి మండలం కాజ గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు జరిపారన్నారు. కానీ చట్టం ప్రకారం నాలుగు ఎకరాలను పంచాయతీకి కేటాయించాల్సి ఉన్నా ఆ పనిచేయలేదన్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి విలువ 15 కోట్లుగా ఉందని… కాబట్టి ఒక్క కాజ గ్రామానికే లింగమనేని సంస్థ 60 కోట్ల విలువైన భూమిని ఎగ్గొట్టిందని ఆర్కే మండిపడ్డారు. పైగా లేఅవుట్ ఫీజు గానీ, బిల్డింగ్ పర్మిట్ ఫీజు కూడా గ్రామ పంచాయతీకి చెల్లించలేదన్నారు.

అటు నంబూరు, కంతేరు గ్రామాల సమీపంలో 200 ఎకరాల్లో వెంచర్లు వేశారని… కానీ అక్కడ కూడా పంచాయతీకి భూమిని అప్పగించడం గానీ, ఫీజులు చెల్లించడం గానీ చేయకుండా 250 కోట్ల మేర లబ్ది పొందారని ఆర్కే ఆరోపించారు. చంద్రబాబుకు కరకట్ట భవనాన్ని కట్టబెట్టి ఆయన అండతోనే లింగమనేని ఇలా రెచ్చిపోయారని ఆర్కే చెప్పారు.

కరకట్ట భవనం విషయంలో సీఆర్‌డీఏ నోటీసులకు లింగమనేని ఇచ్చిన సమాధానం మరోసారి ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు. నిజంగా పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుని ఉంటే 2015 ఫిబ్రవరిలోనే నోటీసులు జారీ అయినప్పుడు ఆవిషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

బహుశా ఈ మధ్య పంచాయతీ అధికారులను బెదిరించి అనుమతులు తెచ్చుకున్నారేమో పరిశీలిస్తామన్నారు. అన్నింటికి మించి కరకట్ట భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశానని మూడేళ్ల క్రితమే లింగమనేని రమేష్ మీడియా సమక్షంలోనే చెప్పారని… ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త నాటకం వేస్తున్నారని ఆర్కే మండిపడ్డారు.

First Published:  6 July 2019 3:35 AM GMT
Next Story