Telugu Global
Cinema & Entertainment

తాప్సీ మంచి నటి....కానీ.... రంగోలి సంచలన కామెంట్స్

బాలీవుడ్ లో వివాదాస్పద హీరోయిన్ గా పేరున్న కంగనా రనౌత్ మరియు ఆమె చెల్లెలు రంగోలి… ఎప్పటికప్పుడు వారి కామెంట్లతో కొత్త వివాదాలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే హృతిక్ రోషన్, అలియాభట్ మరియు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన వీరు ఇప్పుడు సౌత్ బ్యూటీ తాప్సీ పన్ను పై మండి పడుతున్నారు. తాప్సి “సస్తీ (చీప్) కంగనా” అంటూ రంగోలి సోషల్ మీడియా ద్వారా షాకింగ్ కామెంట్ చేసింది. బాలీవుడ్ […]

తాప్సీ మంచి నటి....కానీ.... రంగోలి సంచలన కామెంట్స్
X

బాలీవుడ్ లో వివాదాస్పద హీరోయిన్ గా పేరున్న కంగనా రనౌత్ మరియు ఆమె చెల్లెలు రంగోలి… ఎప్పటికప్పుడు వారి కామెంట్లతో కొత్త వివాదాలు క్రియేట్ చేస్తూనే ఉంటారు.

ఇప్పటికే హృతిక్ రోషన్, అలియాభట్ మరియు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన వీరు ఇప్పుడు సౌత్ బ్యూటీ తాప్సీ పన్ను పై మండి పడుతున్నారు. తాప్సి “సస్తీ (చీప్) కంగనా” అంటూ రంగోలి సోషల్ మీడియా ద్వారా షాకింగ్ కామెంట్ చేసింది.

బాలీవుడ్ నుంచి తాప్సీకి చాలా ఆఫర్లు వస్తున్నాయని దానికి కారణం ఆమె తక్కువ రెమ్యునరేషన్ అడగటమేనని రంగోలి చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా తాప్సీ కూడా కంగనా లాగా చాలా మంచి నటి అని… కాకపోతే తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమాలు చేస్తుండటంతో ఆమె సస్తీ కంగనా అంటూ కామెంట్లు చేసింది రంగోలి.

అయితే తాప్సీ కావాలని కంగనారనౌత్ పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తోందని, అందుకే తను డైరెక్ట్ గా ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నానని తనను ఎవరూ ఆపలేరని రంగోలి సోషల్ మీడియా ద్వారా తాప్సి పై మండి పడింది.

ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు తాప్సి ఈ మధ్యనే ‘గేమ్ ఓవర్’ అనే సినిమాతో హిట్ అందుకుంది.

First Published:  5 July 2019 12:19 AM GMT
Next Story