Telugu Global
Cinema & Entertainment

కళ్యాణ్ రామ్.. ఎంత మంచివాడవురా!

కుటుంబ కథా చిత్రాల దర్శకుడి గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. మొదటి సినిమా దొంగల బండి తో కామెడీ ని బాగా పండిస్తాడు అని పేరు తెచ్చుకుని, తన నైపుణ్యం కేవలం కామెడీ కి మాత్రమే పరిమితం కాదని నిరూపిస్తూ శతమానం భవతి అనే సినిమా తీసి, ఈ సినిమా తో జాతీయ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేశారు కానీ అది ఆశించిన […]

కళ్యాణ్ రామ్.. ఎంత మంచివాడవురా!
X

కుటుంబ కథా చిత్రాల దర్శకుడి గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. మొదటి సినిమా దొంగల బండి తో కామెడీ ని బాగా పండిస్తాడు అని పేరు తెచ్చుకుని, తన నైపుణ్యం కేవలం కామెడీ కి మాత్రమే పరిమితం కాదని నిరూపిస్తూ శతమానం భవతి అనే సినిమా తీసి, ఈ సినిమా తో జాతీయ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేశారు కానీ అది ఆశించిన స్థాయి లో ఆడలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈయన ఒక సినిమా తో బిజీ గా ఉన్నారు. నిజానికి ముందుగా నాగ శౌర్య తో పని చేయాలి అనే ఆలోచన చేసినా…. అయన మాత్రం చివరికి నందమూరి కళ్యాణ్ రామ్ కి కథ చెప్పి ఒప్పించి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ కూడా మొదలయింది. అయితే ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ ని, ఈ రోజు కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భం గా విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా కి ‘ఎంత మంచివాడవురా’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. మెహ్రీన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీదేవి మూవీస్ మరియు ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ని సంయుక్తం గా నిర్మిస్తున్నాయి.

First Published:  4 July 2019 10:46 PM GMT
Next Story