Telugu Global
NEWS

ఎన్నికలప్పుడు విత్తనాల గురించి నేతలు ఎక్కడ చూసుకుంటారు?

ఏపీలో విత్తనాల కొరతపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విత్తన సేకరణకు కేటాయించాల్సిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించడం, అక్టోబర్ నుంచే విత్తన సేకరణ ప్రారంభించాల్సి ఉన్నా అలా చేయకపోవడం వల్లే ప్రస్తుతం ఇబ్బందులు వచ్చాయని కొత్త ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు టీడీపీ మాత్రం తమకేం సంబంధం లేదంటోంది. బాధ్యత కొత్త ప్రభుత్వానిదే అంటోంది. ఈ అంశంపై స్పందించిన టీడీపీ నేత జూపూడి ప్రభాకర్… ఇలాంటి విషయాల్లో గత ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం […]

ఎన్నికలప్పుడు విత్తనాల గురించి నేతలు ఎక్కడ చూసుకుంటారు?
X

ఏపీలో విత్తనాల కొరతపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విత్తన సేకరణకు కేటాయించాల్సిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించడం, అక్టోబర్ నుంచే విత్తన సేకరణ ప్రారంభించాల్సి ఉన్నా అలా చేయకపోవడం వల్లే ప్రస్తుతం ఇబ్బందులు వచ్చాయని కొత్త ప్రభుత్వం చెబుతోంది.

ఇందుకు టీడీపీ మాత్రం తమకేం సంబంధం లేదంటోంది. బాధ్యత కొత్త ప్రభుత్వానిదే అంటోంది. ఈ అంశంపై స్పందించిన టీడీపీ నేత జూపూడి ప్రభాకర్… ఇలాంటి విషయాల్లో గత ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. విత్తనాలు వంటి అంశాన్ని అధికార యంత్రాంగం చూసుకోవాలన్నారు. రాజకీయ మార్పిడి జరిగినా అధికార యంత్రాంగం అలాగే ఉంటుంది కదా అని ప్రశ్నించారు.

జనవరిలోనే విత్తన సేకరణ పూర్తి చేయకుండా గత ప్రభుత్వం గాలికొదిలేసింది కదా? అని ప్రశ్నించగా… ఎన్నికలు వచ్చాక దేశంలో ఎవరైనా ఎన్నికల మూడ్‌లోనే ఉంటారని… ఇలాంటి అంశాలను రాజకీయ నేతలు ఎక్కడ చూసుకుంటారని వ్యాఖ్యానించారు.

అంటే ప్రజలు ఎటు పోయినా సంబంధం లేదంటారా? అని తిరిగి ప్రశ్నించగా… సాధారణంగా జరిగేది అదే కదా… వాస్తవాలు చేదుగానే ఉంటాయి…. అంటూ జూపూడి సమాధానం ఇచ్చారు. విత్తనాల సేకరణ వంటి అంశాల్లో అధికారులు సరిగా పనిచేస్తున్నారా లేదా అన్నది రైతులు కూడా సరిచూసుకోవాలని సలహా ఇచ్చారు జూపూడి.

అయితే అధికారులు విత్తనాల కొనుగోలుకు డబ్బులు మంజూరు చేయమని చంద్రబాబు ప్రభుత్వానికి 28 లేఖలు రాసినా…. డబ్బులు మంజూరు చేయని అప్పటి ప్రభుత్వాన్ని కాకుండా అధికారులను జూపూడి తప్పుపట్టడం సరికాదంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.

First Published:  4 July 2019 8:31 PM GMT
Next Story