Telugu Global
Cinema & Entertainment

ఈ వీకెండ్ మొత్తం బేబీదే హవా

సమంతకు మరో డేట్ సెట్ అయింది. ఎలాంటి పోటీలేకుండా ఓ బేబీ సినిమా రిలీజ్ అవుతోంది. దీనంతటికీ కారణం తెరవెనక సురేష్ బాబు అనే విషయం అందరికీ తెలిసిందే. తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా కోసం ఎలాంటి పోటీలేకుండా చేసుకున్నారు సురేష్ బాబు. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఓబేబీ సినిమాతో పాటు బుర్రకథ అనే మరో సినిమా మాత్రమే వస్తోంది. నిజానికి బుర్రకథ సినిమాను కూడా సురేష్ బాబు ఆదిలోనే సైడ్ […]

ఈ వీకెండ్ మొత్తం బేబీదే హవా
X

సమంతకు మరో డేట్ సెట్ అయింది. ఎలాంటి పోటీలేకుండా ఓ బేబీ సినిమా రిలీజ్ అవుతోంది. దీనంతటికీ కారణం తెరవెనక సురేష్ బాబు అనే విషయం అందరికీ తెలిసిందే. తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా కోసం ఎలాంటి పోటీలేకుండా చేసుకున్నారు సురేష్ బాబు. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఓబేబీ సినిమాతో పాటు బుర్రకథ అనే మరో సినిమా మాత్రమే వస్తోంది.

నిజానికి బుర్రకథ సినిమాను కూడా సురేష్ బాబు ఆదిలోనే సైడ్ చేశారు. కానీ కల్కితో పాటు రావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల వల్ల వాయిదాపడింది. అలా ఆఖరి నిమిషంలో ఓ బేబీ సినిమాతో పాటు థియేటర్లలోకి వస్తోంది. అయినా సమంత స్టార్ డమ్ ముందు ఆది చేసిన బుర్రకథ తేలిపోతుందని ధీమాగా ఉన్నాడు సురేష్ బాబు. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఓ బేబీకి, బుర్రకథ పోటీ ఇవ్వదని ఫిక్స్ అయిపోయాడు.

ఈ రెండు సినిమాలతో పాటు కాకతీయుడు, దుర్మార్గుడు అనే మరో సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. తారకరత్న నటించిన కాకతీయుడు సినిమాకు అస్సలు థియేటర్లు దొరకలేదు. దుర్మార్గుడు సినిమా పరిస్థితి కూడా అంతే. సో.. ఈ వీకెండ్ థియేటర్లలో బేబీదే పూర్తి ఆధిపత్యం.

First Published:  4 July 2019 12:30 AM GMT
Next Story