Telugu Global
Cinema & Entertainment

'రణరంగం' నుంచి.... పెళ్లి పాట

శర్వానంద్ తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ మరియు కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా. తాజాగా సినిమా నుండి ‘సీతా కళ్యాణం’ అనే పాట లిరికల్ వీడియో ను విడుదల చేశారు. శర్వానంద్ మరియు కల్యాణి ప్రియదర్శన్ ల పెళ్లి అప్పుడు ఈ పాట వెండితెరపై రాబోతోంది అని తెలుస్తోంది. ప్రశాంత్ […]

రణరంగం నుంచి.... పెళ్లి పాట
X

శర్వానంద్ తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ మరియు కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా.

తాజాగా సినిమా నుండి ‘సీతా కళ్యాణం’ అనే పాట లిరికల్ వీడియో ను విడుదల చేశారు. శర్వానంద్ మరియు కల్యాణి ప్రియదర్శన్ ల పెళ్లి అప్పుడు ఈ పాట వెండితెరపై రాబోతోంది అని తెలుస్తోంది.

ప్రశాంత్ పిళ్ళై అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మరబోతోందని అంటున్నారు. శ్రీహరి కె గొంతు ఈ పాటకి చాలా బాగా సెట్ అయింది. బాలాజీ అందించిన లిరిక్స్ కూడా పాటకి మరింత బలాన్ని చేకూర్చాయి.

ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సూర్యదేవర సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నాడు.

#RanarangamFirstSingle,#SeethaKalyanam is here – https://youtu.be/LG6PANt6sM8 ❤️❤️

Posted by Sharwanand on Thursday, 4 July 2019

First Published:  4 July 2019 7:17 AM GMT
Next Story