Telugu Global
National

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ ఒక పరువు నష్టం కేసులో ముంబై కోర్టులో హాజరయ్యారు. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యానంతరం రాహుల్ గాంధీ… బీజేపీ – ఆర్ఎస్ఎస్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు ఇవాళ విచారణకు రావడంతో రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. 2017 సెప్టెంబర్ 5న బెంగుళూరు లోని తన నివాసంలో గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై […]

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
X

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ ఒక పరువు నష్టం కేసులో ముంబై కోర్టులో హాజరయ్యారు. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యానంతరం రాహుల్ గాంధీ… బీజేపీ – ఆర్ఎస్ఎస్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు ఇవాళ విచారణకు రావడంతో రాహుల్ కోర్టుకు హాజరయ్యారు.

2017 సెప్టెంబర్ 5న బెంగుళూరు లోని తన నివాసంలో గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై స్పందించిన రాహుల్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలపై వ్యతిరేకంగా మాట్లాడే వారిపై దాడులు జరుగుతాయి…. అంతే కాకుండా హత్యకు కూడా గురవుతారని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ముంబైకి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త దృతిమన్ జోషి కేసు వేశారు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్నారు. తానేం తప్పు చేయలేదని రాహుల్ కోర్టుకు చెప్పారు. అన్ని వాదనలు విన్న తర్వాత రాహుల్ గాంధీకి 15 వేల రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ ‘నాపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ పోరాటాన్ని నేను ఆస్వాదిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.

First Published:  4 July 2019 2:28 AM GMT
Next Story