Telugu Global
Cinema & Entertainment

నోటా ఎఫెక్ట్.... అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట..!

విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫ్లాపుల కంటే ఎక్కువ హిట్ సినిమాలే ఉన్నాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన సినిమాల విషయంలో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. కేవలం ఒకే ఒక్క ఫ్లాప్ సినిమాతో ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోతాయని నోట సినిమాతోనే బాగా అర్థం చేసుకున్న విజయ్ దేవరకొండ…. ఫ్లాప్ సినిమాలో తాను చేసిన తప్పులు తన తదుపరి సినిమా లో రిపీట్ అవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో […]

నోటా ఎఫెక్ట్.... అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట..!
X

విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫ్లాపుల కంటే ఎక్కువ హిట్ సినిమాలే ఉన్నాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన సినిమాల విషయంలో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.

కేవలం ఒకే ఒక్క ఫ్లాప్ సినిమాతో ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోతాయని నోట సినిమాతోనే బాగా అర్థం చేసుకున్న విజయ్ దేవరకొండ…. ఫ్లాప్ సినిమాలో తాను చేసిన తప్పులు తన తదుపరి సినిమా లో రిపీట్ అవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఇప్పటినుంచే టెన్షన్ పడుతున్నాడట.

‘టాక్సీ వాలా’ సినిమా విషయంలో కూడా కొన్ని సన్నివేశాలు దగ్గరుండి రీషూట్ చేయించిన విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ విషయంలో కూడా అదే చేస్తున్నాడని సమాచారం.

ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారట. విజయ్ దేవరకొండ మరియు రష్మికా ల మధ్య సన్నివేషాలు బాగా రాలేదని…. వాటిని మళ్లీ రీషూట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమాకి సంబంధించిన అన్ని పనులను విజయ్ దేవరకొండ దగ్గరుండి చూసుకుంటున్నాడట. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో వేచి చూడాలి.

First Published:  4 July 2019 12:52 AM GMT
Next Story