Telugu Global
Cinema & Entertainment

నితిన్ సినిమాపై కారుమబ్బులు

నితిన్ ఎంత ఫాస్ట్ గా ఓ సినిమా లాంఛ్ చేశాడో.. అంతే ఫాస్ట్ గా ఆ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ హీరో.. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా స్టార్ట్ చేశాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రావాల్సిన ఆ సినిమాపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బడ్జెట్ పరిమితులు దాటిపోతుందనే ఉద్దేశంతో, నిర్మాత ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాకు కొబ్బరికాయ కొట్టకముందే బడ్జెట్ గురించి అంతా కలిసి […]

నితిన్ సినిమాపై కారుమబ్బులు
X

నితిన్ ఎంత ఫాస్ట్ గా ఓ సినిమా లాంఛ్ చేశాడో.. అంతే ఫాస్ట్ గా ఆ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ హీరో.. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా స్టార్ట్ చేశాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రావాల్సిన ఆ సినిమాపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బడ్జెట్ పరిమితులు దాటిపోతుందనే ఉద్దేశంతో, నిర్మాత ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సినిమాకు కొబ్బరికాయ కొట్టకముందే బడ్జెట్ గురించి అంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. తీరా రేపోమాపో సెట్స్ పైకి వెళ్తుందనే టైమ్ కు బడ్జెట్ లెక్కలు మరోసారి తలనొప్పిగా మారినట్టు చెబుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాకు కాల్షీట్లు కూడా కేటాయించారు. అంతలోనే ఇలా సినిమాపై అనుమానాలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం భీష్మ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు నితిన్. ఆ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో ఓ భారీ షెడ్యూల్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, చంద్రశేఖర్ ఏలేటి సినిమా గురించి ఆలోచిస్తాడు.

నిజంగా నిర్మాత చెబుతున్నట్టు బడ్జెట్ పెరిగితే, తనే సహ-నిర్మాతగా మారి సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి నితిన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఏదేమైనా నితిన్ రంగంలోకి దిగేవరకు ఈ గాసిప్స్ ఇలా వినిపిస్తూనే ఉంటాయి.

First Published:  3 July 2019 8:28 PM GMT
Next Story