Telugu Global
NEWS

బాబు ఓడిపోగానే నిద్రలేచే కుంభకర్ణుడు లోక్‌సత్తా జేపీయేనా?

ఏపీ బీజేపీ నేత పురిఘళ్ల రఘురామ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక ప్రతికకు రాసిన వ్యాసంలో ఏపీలో పరిస్థితులపై రఘురామ్ సునిశిత విమర్శలు చేశారు. ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా… టీడీపీ, కొందరు మేధావులు అడ్డుపడుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్లు కట్టారు కదా అని పార్లమెంట్‌ను కూల్చలేరు కదా..! అంటూ ప్రజావేదిక కూల్చివేతపై లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ చేసిన వ్యాఖ్యలను రఘురామ్ పరోక్షంగా ప్రస్తావించారు. జేపీ పేరు ఎత్తకుండానే అందరికీ […]

బాబు ఓడిపోగానే నిద్రలేచే కుంభకర్ణుడు లోక్‌సత్తా జేపీయేనా?
X

ఏపీ బీజేపీ నేత పురిఘళ్ల రఘురామ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక ప్రతికకు రాసిన వ్యాసంలో ఏపీలో పరిస్థితులపై రఘురామ్ సునిశిత విమర్శలు చేశారు. ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా… టీడీపీ, కొందరు మేధావులు అడ్డుపడుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

బ్రిటిష్ వాళ్లు కట్టారు కదా అని పార్లమెంట్‌ను కూల్చలేరు కదా..! అంటూ ప్రజావేదిక కూల్చివేతపై లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ చేసిన వ్యాఖ్యలను రఘురామ్ పరోక్షంగా ప్రస్తావించారు. జేపీ పేరు ఎత్తకుండానే అందరికీ అర్థమయ్యే రీతిలోనే విమర్శలు చేశారు. ప్రజావేదిక కూల్చడం అతిపెద్ద తప్పు, అది కక్ష సాధింపు… రాజులాగా నచ్చింది చేస్తున్నారు అంటూ కొందరు పదేపదే వల్లిస్తున్నారని… గతంలో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా వీరు ఇదే తరహాలో మాట్లాడారని, పాత పేపర్లు తిరగేస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు.

కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయినట్టుగా… కొందరు గత ఐదేళ్లు నిద్రపోయి… చంద్రబాబు ఓడిపోగానే నిద్రలేచారని రఘురామ్ విమర్శించారు. అలా నిద్రలేచి గడిచిన ఐదేళ్లలో ఏం జరిగిందో తమకు తెలియనట్టుగా… ఇప్పుడు జరుగుతున్నవన్నీ తప్పులే అన్నట్టు ప్రజలకు జ్ఞానోపదేశం చేస్తున్నారని పరోక్షంగా జయప్రకాశ్‌ నారాయణ లాంటి వారిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇస్తే తప్పుపడుతున్న వారు.. మరి టీటీడీ ప్రధానార్చకుడిగా పనిచేసిన రమణదీక్షితులు ఇంటికి ఇదే తరహాలో నోటీసులు అతికించినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

తెల్లవాళ్లు పార్లమెంట్‌ను కట్టినా కూల్చలేదంటూ ఒక పోలికను కూడా తెచ్చారని పరోక్షంగా ఇటీవల లోక్‌సత్తా జేపీ చేసిన వ్యాఖ్యలను రఘురామ్ ప్రస్తావించారు. దేన్ని దేనితో ముడిపెడుతున్నారు… అసలు పార్లమెంట్‌కు… ప్రజావేదిక నిర్మాణానికి పొంతన ఎక్కడుందని ప్రశ్నించారు. పార్లమెంట్‌ను ప్రజావేదిక తరహాలో నది పక్కన నిర్మించలేదు కదా? అని గుర్తు చేశారు. పార్లమెంట్ భవనం అక్రమ భవనం కాదు…. తాత్కాలిక భవనం అంతకంటే కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక సచివాలయం కట్టారని.. దాన్ని ప్రభుత్వం కూల్చలేదు కదా…. కేవలం నది పక్కన నిర్మాణాలను మాత్రమే కూలుస్తోందని వివరించారు.

విమర్శలు చేసే కొందరి తీరు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక గాడిద-దంపతుల కథలా ఉంటుందని… ఏం చేసినా విమర్శలు చేస్తూనే ఉంటారని బీజేపీ నేత రఘురామ్‌ అభిప్రాయపడ్డారు.

First Published:  3 July 2019 1:20 AM GMT
Next Story