Telugu Global
Cinema & Entertainment

మజిలీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న సమంత

మజిలీ సినిమా విడుదలకు ముందు తిరుమల వెళ్లింది సమంత. అది కూడా మాములుగా కాదు, కాలినడకన కొండెక్కి స్వామి దర్శనం చేసుకుంది. కట్ చేస్తే, మజిలీ పెద్ద హిట్ అయింది. దీంతో ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీకి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది సమంత. ఈ శుక్రవారం సమంత నటించిన ఓ బేబీ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా సమంత మరోసారి మెట్లు ఎక్కి తిరుమల చేరుకుంది. తన ఫ్రెండ్ రమ్య సుబ్రమణ్యన్ తో […]

మజిలీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న సమంత
X

మజిలీ సినిమా విడుదలకు ముందు తిరుమల వెళ్లింది సమంత. అది కూడా మాములుగా కాదు, కాలినడకన కొండెక్కి స్వామి దర్శనం చేసుకుంది. కట్ చేస్తే, మజిలీ పెద్ద హిట్ అయింది. దీంతో ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీకి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది సమంత.

ఈ శుక్రవారం సమంత నటించిన ఓ బేబీ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా సమంత మరోసారి మెట్లు ఎక్కి తిరుమల చేరుకుంది. తన ఫ్రెండ్ రమ్య సుబ్రమణ్యన్ తో కలిసి కాలినడకన తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుంది సమంత.

సరిగ్గా ఇలాంటి సెంటిమెంట్ దిల్ రాజుకు కూడా ఉంది. తన ప్రతి సినిమా విడుదలకు ముందు దిల్ రాజు ఇలా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటాడు. ఆమధ్య బెల్లంకొండ సాయిశ్రీనివాస్, సాయితేజ్ లాంటి నటులు కూడా ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సమంత కూడా చేరిపోయిందన్నమాట.

First Published:  2 July 2019 4:11 AM GMT
Next Story