Telugu Global
Cinema & Entertainment

సైకిల్ తొక్కుతున్న సాయి పల్లవి.... విరాట పర్వం 'లీకులు'

‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా తో తెలుగు తెర కి పరిచయం అయ్యాడు దర్శకుడు వేణు ఉడుగుల. ఈ సినిమా విజయం తరువాత కార్తీ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు ఈ దర్శకుడు. కారణాలు తెలియవుకానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. వెంటనే రానా దగ్గుబాటి కి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు వేణు. అలాగే సాయి పల్లవి ని కూడా హీరోయిన్ గా ఓకే చేయించుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే […]

సైకిల్ తొక్కుతున్న సాయి పల్లవి.... విరాట పర్వం లీకులు
X

‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా తో తెలుగు తెర కి పరిచయం అయ్యాడు దర్శకుడు వేణు ఉడుగుల. ఈ సినిమా విజయం తరువాత కార్తీ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు ఈ దర్శకుడు. కారణాలు తెలియవుకానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.

వెంటనే రానా దగ్గుబాటి కి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు వేణు. అలాగే సాయి పల్లవి ని కూడా హీరోయిన్ గా ఓకే చేయించుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలయ్యింది. అయితే విరాట పర్వం అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా 90 ల్లో జరిగిన కొన్ని రాజకీయ పరిస్థుతుల ఆధారం గా తీయబడుతుంది. ఈ సినిమా లో టబు కూడా ఒక కీలక పాత్ర లో కనిపించనుంది అని టాక్.

ఇక ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి మొదటి షెడ్యూల్ విజయవంతం గా పూర్తయిందని తెలుస్తుంది. అయితే షూటింగ్ కి సంబంధించి సాయి పల్లవి ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. అందులో సాయి పల్లవి ఒక పల్లెటూరు నేపథ్యం లో సైకిల్ తొక్కుతూ కనిపించింది. ప్రస్తుతం వీడియో లో ఉన్న ఈ స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ ఉంది.

First Published:  2 July 2019 1:12 AM GMT
Next Story