Telugu Global
Cinema & Entertainment

రావణ టైటిల్ తో కళ్యాణ్ రామ్ సినిమా

రావణ పేరు వినగానే ఎవ్వరికైనా ఎన్టీఆర్ గుర్తొస్తాడు. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన రావణ పాత్రను, ఆ సినిమాలో టైటిల్ సాంగ్ ను ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోలేరు. ఇప్పుడా టైటిల్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు కల్యాణ్ రామ్. విశిష్ట అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చాన్నాళ్ల కిందటే ఈ స్క్రిప్ట్ పూర్తిచేశాడు వశిష్ట. నిజానికి ఎన్టీఆర్, బాలయ్యలతో చేయాలనుకున్న మల్టీస్టారర్ ప్రాజెక్టు కూడా ఇదే అని టాక్. […]

రావణ టైటిల్ తో కళ్యాణ్ రామ్ సినిమా
X

రావణ పేరు వినగానే ఎవ్వరికైనా ఎన్టీఆర్ గుర్తొస్తాడు. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన రావణ పాత్రను, ఆ సినిమాలో టైటిల్ సాంగ్ ను ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోలేరు. ఇప్పుడా టైటిల్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు కల్యాణ్ రామ్. విశిష్ట అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

చాన్నాళ్ల కిందటే ఈ స్క్రిప్ట్ పూర్తిచేశాడు వశిష్ట. నిజానికి ఎన్టీఆర్, బాలయ్యలతో చేయాలనుకున్న మల్టీస్టారర్ ప్రాజెక్టు కూడా ఇదే అని టాక్. ఇప్పుడీ సినిమాలో నటించడానికి కల్యాణ్ రామ్ అంగీకరించాడు. మరో నెల రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పైనే ఈ సినిమా వస్తుంది.

అన్నట్టు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ట్విస్ట్ కూడా ఉంది. ముందుగా ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ మతపరమైన సమస్యలు వస్తాయనే భయంతో పాటు.. తుగ్లక్ టైటిల్ పెడితే సినిమాలో సీరియస్ నెస్ తగ్గిపోతుందనే భావనతో ఆ టైటిల్ నుంచి తప్పుకున్నారు. అలా తుగ్లక్ స్థానంలో రావణ అనే టైటిల్ వచ్చి చేరింది. ఈ మూవీకి సంబంధించి మరో ప్రత్యేకత ఏంటంటే.. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది రావణ.

First Published:  2 July 2019 4:26 AM GMT
Next Story