Telugu Global
NEWS

సొంత అంశాలు... హైకోర్టుకు చంద్రబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత పనులను చక్కబెట్టుకోవడంలోనే బిజీగా ఉన్నారు. ఇల్లు, కార్యాలయం, భద్రత ఈ అంశాలపైనే ఇప్పటి వరకు ఆయన దృష్టి సారిస్తున్నారు. ప్రజావేదికను తనకు కేటాయించాలంటూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తొలి లేఖ ప్రభుత్వానికి రాశారు. ఇప్పుడు తన భద్రతపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. చంద్రబాబుకు తాము భద్రత కుదించలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెబుతున్నప్పటికీ … తన భద్రత తగ్గించారంటూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ వేశారు. ఇదివరకు తరహాలోనే (సీఎంగా […]

సొంత అంశాలు... హైకోర్టుకు చంద్రబాబు
X

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత పనులను చక్కబెట్టుకోవడంలోనే బిజీగా ఉన్నారు. ఇల్లు, కార్యాలయం, భద్రత ఈ అంశాలపైనే ఇప్పటి వరకు ఆయన దృష్టి సారిస్తున్నారు.

ప్రజావేదికను తనకు కేటాయించాలంటూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తొలి లేఖ ప్రభుత్వానికి రాశారు. ఇప్పుడు తన భద్రతపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. చంద్రబాబుకు తాము భద్రత కుదించలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెబుతున్నప్పటికీ … తన భద్రత తగ్గించారంటూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ వేశారు.

ఇదివరకు తరహాలోనే (సీఎంగా ఉన్నప్పటి తరహాలో) తన భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది. తనకు భద్రతను తగ్గించడం అంటే జీవించే హక్కును హరించడమేనని చంద్రబాబు వాదించారు. తాను 41 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని… పలు పదవులు చేపట్టానని… మావోయిస్టుల నుంచి కూడా ముప్పు ఉందని పిటిషన్‌లో చంద్రబాబు వివరించారు.

చంద్రబాబు పిటిషన్‌పై డీజీపీ సవాంగ్ స్పందించారు. ప్రతిపక్ష నాయకుడికి ఎలాంటి భద్రత తగ్గించలేదని… నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని… నిజానికి ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ భద్రతే చంద్రబాబుకు ఇస్తున్నామని డీజీపీ వివరించారు.

First Published:  1 July 2019 8:24 PM GMT
Next Story