Telugu Global
Cinema & Entertainment

బన్నీ కి షాకిచ్చిన లింగుస్వామి

తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అతను దర్శకత్వం వహించిన ‘రన్’, ‘పందెం కోడి’ వంటి సినిమాలు తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… లింగస్వామి తో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. లింగుస్వామి ఇప్పుడు అదే సినిమాకు మరొక టాలీవుడ్ హీరో ని ఎంపిక చేసుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ హీరో ఎవరో […]

బన్నీ కి షాకిచ్చిన లింగుస్వామి
X

తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అతను దర్శకత్వం వహించిన ‘రన్’, ‘పందెం కోడి’ వంటి సినిమాలు తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… లింగస్వామి తో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. లింగుస్వామి ఇప్పుడు అదే సినిమాకు మరొక టాలీవుడ్ హీరో ని ఎంపిక చేసుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ హీరో ఎవరో కాదు హవీష్. ఈ మధ్యనే ‘7’ అనే సినిమాలో నటించిన హవీష్ మొదటి సినిమాతో హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు తాజాగా లింగుస్వామి దర్శకత్వంలో హవీష్ ఒక బైలింగ్వల్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హవీష్ ఒక ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని సమాచారం. సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  2 July 2019 2:31 AM GMT
Next Story