Telugu Global
Cinema & Entertainment

రానా తో తమిళ దర్శకుడు.... 

వివాదాస్పద దర్శకులలో రంజిత్ పేరు ముందుంటుంది. రాజరాజచోళ మరియు హిందువులపై సంచలన వ్యాఖ్యలు చేసిన రంజిత్ ఇప్పటికే చాలా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఇక వివాదాలతో కాకుండా సినిమాలతో వార్తలకెక్కలని నిర్ణయించుకున్న రంజిత్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా మొదలయ్యే లోపు రంజిత్ తమిళంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆర్య, సత్యరాజ్ లను కీలక పాత్రలు పోషించడానికి ఎంపిక చేసినట్లు […]

రానా తో తమిళ దర్శకుడు.... 
X

వివాదాస్పద దర్శకులలో రంజిత్ పేరు ముందుంటుంది. రాజరాజచోళ మరియు హిందువులపై సంచలన వ్యాఖ్యలు చేసిన రంజిత్ ఇప్పటికే చాలా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

కొన్నాళ్లు ఇక వివాదాలతో కాకుండా సినిమాలతో వార్తలకెక్కలని నిర్ణయించుకున్న రంజిత్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా మొదలయ్యే లోపు రంజిత్ తమిళంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా కోసం ఆర్య, సత్యరాజ్ లను కీలక పాత్రలు పోషించడానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్య పాత్ర పోషించడానికి రానా దగ్గుబాటి ని కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్స్ లొనే ఉంది కాబట్టి దీని గురించి అధికారిక ప్రకటన మరియు సినిమా గురించిన మరిన్ని వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరి ఈ దర్శకుడు ఈ సినిమాతో హిట్ అందుకోగలడో లేదో వేచి చూడాలి. పైగా ఇప్పటికే రానా చేతిలో కూడా బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి.

First Published:  1 July 2019 1:00 AM GMT
Next Story