Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమా మొదలు పెట్టిన శర్వానంద్

దాదాపు గా రెండు నుంచి మూడు నెలలు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించినా కానీ శర్వానంద్ మాత్రం చాలా త్వరగా కోలుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. థాయిలాండ్ లో యాక్సిడెంట్ ఆయిన అనంతరం శర్వానంద్ ని హైదరాబాద్ కి తీసుకొని వచ్చాక ఇక్కడ సర్జరీ చేశారు. భుజం లో పెద్ద ఫ్రాక్చర్ కాగా దానికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. మొన్న నే ఒక ఫొటో పెట్టి రణరంగం ప్రమోషన్స్ మొదలవుతున్నాయి అని చెప్పిన శర్వా… తర్వాత […]

కొత్త సినిమా మొదలు పెట్టిన శర్వానంద్
X

దాదాపు గా రెండు నుంచి మూడు నెలలు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించినా కానీ శర్వానంద్ మాత్రం చాలా త్వరగా కోలుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

థాయిలాండ్ లో యాక్సిడెంట్ ఆయిన అనంతరం శర్వానంద్ ని హైదరాబాద్ కి తీసుకొని వచ్చాక ఇక్కడ సర్జరీ చేశారు. భుజం లో పెద్ద ఫ్రాక్చర్ కాగా దానికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. మొన్న నే ఒక ఫొటో పెట్టి రణరంగం ప్రమోషన్స్ మొదలవుతున్నాయి అని చెప్పిన శర్వా… తర్వాత వచ్చిన టీజర్ రెస్పాన్స్ తో హ్యాపీ గా ఉన్నాడు. ఇప్పుడు అయితే ఏకంగా ఒక కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించాడు.

కిషోర్ రెడ్డి అనే ఒక కొత్త దర్శకుడి తో 14 రీల్స్ నిర్మాణ సంస్థ సారథ్యం లో ఈ కొత్త చిత్రం మొదలు కాబోతుంది. గోపి ఆచంట, రామ్ ఆచంట ఈ సినిమా కి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇకపోతే ఈ సినిమా త్వరలో నే మొదలు అయ్యే ఛాన్స్ ఉంది అని శర్వానంద్ సన్నిహితులు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం సినిమా కి సంబందించిన పూజా కార్యక్రమాలని నిర్వహించారు.

First Published:  30 Jun 2019 2:22 AM GMT
Next Story