Telugu Global
NEWS

రాధాకృష్ణ, టీవీ5 మూర్తిపై హైకోర్టుకు లక్ష్మీపార్వతి

ఎన్నికల సమయంలో తన పరువు తీసేందుకు జరిగిన కుట్రపై సీఐడీ, లేదా సీబీఐ చేత విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి హైకోర్టును ఆశ్రయించారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన కోటి అనే వ్యక్తి వెనుక పలువురు పెద్దలు ఉన్నారని… ఈ కుట్ర బయటకు రావాలంటే సీఐడీ, లేదా సీబీఐ విచారణతోనే సాధ్యమని ఆమె హైకోర్టుకు వివరించారు. కుట్రపూరితంగా వ్యవహరించి తన మాన, మర్యాదలకు భంగం కలిగించిన వారిలో నాటి డీజీపీ ఠాకూర్, అప్పటి […]

రాధాకృష్ణ, టీవీ5 మూర్తిపై హైకోర్టుకు లక్ష్మీపార్వతి
X

ఎన్నికల సమయంలో తన పరువు తీసేందుకు జరిగిన కుట్రపై సీఐడీ, లేదా సీబీఐ చేత విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి హైకోర్టును ఆశ్రయించారు.

తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన కోటి అనే వ్యక్తి వెనుక పలువురు పెద్దలు ఉన్నారని… ఈ కుట్ర బయటకు రావాలంటే సీఐడీ, లేదా సీబీఐ విచారణతోనే సాధ్యమని ఆమె హైకోర్టుకు వివరించారు.

కుట్రపూరితంగా వ్యవహరించి తన మాన, మర్యాదలకు భంగం కలిగించిన వారిలో నాటి డీజీపీ ఠాకూర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 మూర్తి ఉన్నారని ఆమె పిటిషన్‌లో వివరించారు.

వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. నమ్మకంగా తన వద్దకు చేరిన కోటి ఆ తర్వాత తన ఫోన్‌ను తీసుకుని అతడి ఫోన్‌కు మెసేజ్‌లు పంపుకుని వాటిని తానే పంపినట్టు ప్రచారం చేశారని… ఈ విషయాన్ని హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులే తేల్చారని కోర్టుకు వివరించారు.

ఠాకూర్, ఏబీ వెంకటేశ్వరరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5మూర్తి కలిసి కుట్ర చేశారని… ఆ తర్వాత తన పరువు తీసేందుకు పదేపదే ఏబీఎన్, టీవీ5 చానల్‌లో ఈ అంశాన్ని ప్రచారం చేశారని వివరించారు. నిందితుడు రెండు ఫోన్లను వినియోగించింది హైదరాబాద్‌లో అయితే… కేసు మాత్రం గుంటూరు జిల్లా వినుకొండలో పెట్టారని గుర్తు చేశారు.

ఈ మొత్తం కుట్ర బయటకు రావాలంటే సీఐడీ, లేదా సీబీఐ చేత విచారణ జరిపించడం ఒక్కటే మార్గమని…. కాబట్టి ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని లక్ష్మీపార్వతి కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించనుంది.

First Published:  30 Jun 2019 1:00 AM GMT
Next Story