Telugu Global
NEWS

కడప జిల్లాలో వెంకయ్యచౌదరి దోపిడి... జగన్‌ స్పందిస్తారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజాభివృద్ధి సంస్థలో భారీ మేత బయటపడింది. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెట్ కార్పొరేషన్‌ ఎండీ వెంకయ్య చౌదరి దాదాపు రెండువేల కోట్ల ఆదాయానికి గండికొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ వర్కర్స్ యూనియన్ … వెంకయ్య చౌదరిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. వెంకయ్య చౌదరి కారణంగా ప్రభుత్వం దాదాపు రెండు వేలకోట్ల మేర నష్టపోయిందని యూనియన్ పెద్దలు చెబుతున్నారు. 2016లో వెంకయ్య చౌదరిని చంద్రబాబు సంస్థ ఎండీగా నియమించారు. ఆ సమయంలో బైరైటీస్‌ […]

కడప జిల్లాలో వెంకయ్యచౌదరి దోపిడి... జగన్‌ స్పందిస్తారా?
X

ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజాభివృద్ధి సంస్థలో భారీ మేత బయటపడింది. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెట్ కార్పొరేషన్‌ ఎండీ వెంకయ్య చౌదరి దాదాపు రెండువేల కోట్ల ఆదాయానికి గండికొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ వర్కర్స్ యూనియన్ … వెంకయ్య చౌదరిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. వెంకయ్య చౌదరి కారణంగా ప్రభుత్వం దాదాపు రెండు వేలకోట్ల మేర నష్టపోయిందని యూనియన్ పెద్దలు చెబుతున్నారు.

2016లో వెంకయ్య చౌదరిని చంద్రబాబు సంస్థ ఎండీగా నియమించారు. ఆ సమయంలో బైరైటీస్‌ ధర టన్నుకు 6వేల 100గా ఉండేది. కానీ వెంకయ్య చౌదరి మాత్రం కేవలం టన్ను 4వేల 100కు మాత్రమే కట్టబెట్టారు. దీని వల్ల ఇప్పటి వరకు రెండు వేల కోట్ల నష్టం ప్రభుత్వానికి వచ్చింది. ఇలా తక్కువ ధరకు బైరైటీస్‌ను సొంతం చేసుకున్న పది మంది కాంట్రాక్టర్లు ఒకే వర్గానికి చెందిన వారు. వారికి తక్కువ ధరకే వెంకయ్య చౌదరిబైరైటీస్‌ను దోచి పెట్టారన్నది ఆరోపణ.

2018-19కి గాను ఏకంగా 11 లక్షల టన్నుల ఏ గ్రేడ్ బైరైటీస్‌ను ఇలా తక్కువ ధరకు వెంకయ్య చౌదరి దోచిపెట్టారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు.

కడప జిల్లాలో దొరికే అత్యంత నాణ్యమైన బైరైటీస్‌ను వెంకయ్య చౌదరి నేతృత్వంలో దోచిపడేశారని ఏపీఎండీసీ వర్కర్స్‌ యూనియన్ ఆరోపిస్తోంది. జగన్‌ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే జరిగిన ఈ భారీ దోపిడిపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని ఏపీఎండీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సొంత జిల్లాలో జరిగిన బాగోతంపై కొత్త ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  30 Jun 2019 11:37 AM GMT
Next Story