Telugu Global
Cinema & Entertainment

సింగిల్ టేక్ లో చించేశాడుగా!

విజయ్ దేవరకొండ ఏం చేసినా అందులో ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనమే విజయ్ దేవరకొండను యూత్ కు దగ్గరచేసింది. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీలో కూడా ఓ కొత్తదనం చూపించాడు విజయ్. సింగిల్ షాట్ లో తీసిన ఓ సాంగ్ ను ఈరోజు విడుదల చేశాడు. డియర్ కామ్రేడ్ సినిమాలోని సాంగ్ ఇది. డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి దశలవారీగా పాటలు విడుదల చేస్తున్నారు. అయితే అవన్నీ లిరికల్ వీడియోలు మాత్రమే. కానీ ఈసారి […]

సింగిల్ టేక్ లో చించేశాడుగా!
X

విజయ్ దేవరకొండ ఏం చేసినా అందులో ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనమే విజయ్ దేవరకొండను యూత్ కు దగ్గరచేసింది. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీలో కూడా ఓ కొత్తదనం చూపించాడు విజయ్. సింగిల్ షాట్ లో తీసిన ఓ సాంగ్ ను ఈరోజు విడుదల చేశాడు. డియర్ కామ్రేడ్ సినిమాలోని సాంగ్ ఇది.

డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి దశలవారీగా పాటలు విడుదల చేస్తున్నారు. అయితే అవన్నీ లిరికల్ వీడియోలు మాత్రమే. కానీ ఈసారి మాత్రం ఏకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. దీనికి కారణం ఇది పాటతో పాటు సింగిల్ షాట్ లో తీసిన వీడియో కావడమే. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాలేజ్ క్యాంటీన్ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను కార్తీక్ ఆలపించాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. కాలేజ్ క్యాంటీన్ లో విజయ్ దేవరకొండ, అతడి ఫ్రెండ్స్ పై తీసిన సాంగ్ ఇది.

అయితే ఈ పాటలో నిరాశ కలిగించిన విషయం ఏంటంటే.. ఇందులో రష్మిక లేదు. ఈ పాట వస్తోందంటూ చేసిన ప్రమోషనల్ వీడియోలో రష్మికను పెట్టారు. దీంతో ఆమె కూడా సాంగ్ లో ఉంటుందని అంతా ఊహించారు. కానీ పాటలో రష్మిక కనిపించలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జులై 26న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  30 Jun 2019 7:17 AM GMT
Next Story