Telugu Global
NEWS

హరీష్ కు కేసీఆర్ పిలుపు.... కారణమదే....

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ తర్వాత హరీష్ రావు.. ఇద్దరూ ఉద్యమకారులే. మామ ప్రోద్బలంతో టీఆర్ఎస్ లో అసలైన ఉద్యమకారుడిగా హరీష్ ఎదిగారు. అన్నింటా తానై వ్యవహరించాడు. గడిచిన ప్రభుత్వంలోనూ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా సత్తా చాటారు. అయితే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ఫోకస్ చేయడం.. హరీష్ ను సైడ్ చేయడం లాంటి వార్తలు తెలంగాణ రాష్ట్రసమితి వర్గాల్లో కలకలం రేపాయి. హరీష్ పై సానుభూతిని కురిపించాయి. మంత్రివర్గ విస్తరణలోనూ కేసీఆర్ కొడుకు […]

హరీష్ కు కేసీఆర్ పిలుపు.... కారణమదే....
X

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ తర్వాత హరీష్ రావు.. ఇద్దరూ ఉద్యమకారులే. మామ ప్రోద్బలంతో టీఆర్ఎస్ లో అసలైన ఉద్యమకారుడిగా హరీష్ ఎదిగారు. అన్నింటా తానై వ్యవహరించాడు. గడిచిన ప్రభుత్వంలోనూ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా సత్తా చాటారు. అయితే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ఫోకస్ చేయడం.. హరీష్ ను సైడ్ చేయడం లాంటి వార్తలు తెలంగాణ రాష్ట్రసమితి వర్గాల్లో కలకలం రేపాయి. హరీష్ పై సానుభూతిని కురిపించాయి.

మంత్రివర్గ విస్తరణలోనూ కేసీఆర్ కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ ను పక్కనపెట్టారు. కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో హరీష్ ను సైడ్ చేశారన్న టాక్ పెద్ద ఎత్తున పార్టీశ్రేణుల్లోకి వెళ్లి కాస్త దెబ్బ కూడా గులాబీ పార్టీకి పడ్డది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ కనిపించింది.

అయితే ఈ అనుమానాలు, అవమానాల సంగతి ఎలా ఉన్నా హరీష్ రావు మాత్రం నమ్మిన బంటుగా కేసీఆర్ వెంట నడిచారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నేతల సమావేశంలో హరీష్ ను వేయినోళ్ల పొగిడి తమ మధ్యనున్న గ్యాప్ కు పుల్ స్టాప్ పెట్టారట కేసీఆర్.

పార్టీ సభ్యత్వాన్ని స్వయంగా తీసుకోవాలని హరీష్ ను కోరిన కేసీఆర్…. ఈ సందర్భంగా హరీష్ తనతోపాటు ఉద్యమ కాలం నుంచి పనిచేశారని.. తెలంగాణ మొదటి ప్రభుత్వంలో ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తి చేయడంలో హరీష్ కృషి ఎనలేనిదని వ్యాఖ్యానించాడట.. దీంతో అల్లుడు హరీష్ ను దూరం పెట్టారన్న అపవాదును కేసీఆర్ ఈ రకంగా ప్రశంసించి తొలగించుకున్నారు. త్వరలోనే దసరా నాటికి హరీష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  29 Jun 2019 3:31 AM GMT
Next Story