Telugu Global
NEWS

నారా లోకేష్ ఉనికి పాట్లు " హోమ్ మంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉనికి కోసం పాట్లు పడుతున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురుకావడంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత అన్నారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త హత్యను ప్రభుత్వం పైనా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైనా వేసేందుకు మాజీ మంత్రి నారా లోకేష్ తంటాలు పడుతున్నారని హోం మంత్రి సుచరిత విలేకరుల సమావేశంలో […]

నారా లోకేష్ ఉనికి పాట్లు  హోమ్ మంత్రి సుచరిత
X

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉనికి కోసం పాట్లు పడుతున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురుకావడంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత అన్నారు.

మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త హత్యను ప్రభుత్వం పైనా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైనా వేసేందుకు మాజీ మంత్రి నారా లోకేష్ తంటాలు పడుతున్నారని హోం మంత్రి సుచరిత విలేకరుల సమావేశంలో ఘాటుగా విమర్శించారు.

మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త హత్య కుటుంబ వ్యవహారమని, దానికి రాజకీయాలను ఆపాదించటం సరికాదని మంత్రి హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి సుచరిత… మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ట్వీట్లన్నీ ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసమేనని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణే ప్రాణంగా ఉంటారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడతారే తప్ప హత్యా రాజకీయాలకు పాల్పడరని హోం మంత్రి తెలిపారు.

గడచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
చేసిన దాడులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వందలాది మంది గాయపడ్డారని హౌంమంత్రి సుచరిత అన్నారు.

“ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు దాడులు చేస్తూనే ఉన్నారు. వారి దాడులలో 57 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు” అని సుచరిత స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి కుటుంబ వివాదాలను, వ్యక్తిగత కక్షలను ప్రభుత్వానికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి రాజకీయంగా లబ్ధి పొందాలని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని మంత్రి సుచరిత మండిపడ్డారు.

First Published:  28 Jun 2019 9:07 PM GMT
Next Story