Telugu Global
NEWS

విజయనిర్మల భౌతిక కాయానికి జగన్ నివాళి

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం నానక్ రామ్ గూడాలోని సూపర్ స్టార్ క్రిష్ణ నివాసానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించారు. విజయనిర్మల భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అక్కడే ఉన్న విజయనిర్మల కుమారుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు నరేష్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. నరేష్ ను దగ్గరుకు […]

విజయనిర్మల భౌతిక కాయానికి జగన్ నివాళి
X

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.

శుక్రవారం ఉదయం నానక్ రామ్ గూడాలోని సూపర్ స్టార్ క్రిష్ణ నివాసానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించారు. విజయనిర్మల భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అక్కడే ఉన్న విజయనిర్మల కుమారుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు నరేష్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.

నరేష్ ను దగ్గరుకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనను ఓదార్చారు. అనంతరం విజయనిర్మల భర్త, సూపర్ స్టార్ క్రిష్ణ వద్దకు వెళ్లి ఆయనను కూడా పరామర్శించారు.

తమ కుటుంబానికి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అన్నా…. ఆయన కుటుంబమన్నా ఎంతో ఇష్టం, గౌరవమని నరేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. కంటతడి పెట్టిన సూపర్ స్టార్ క్రిష్ణను జగన్ ఓదార్చారు.

విజయనిర్మల ఇంట్లో ఉన్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి చిత్రపటాలను నరేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారు. జగన్మోహన్ రెడ్డిని సూపర్ స్టార్ క్రిష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఇంట్లోకి తీసుకుని వెళ్లారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు అరగంట పాటు క్రిష్ణ నివాసంలోనే గడిపారు. గురువారం నాడు విజయనిర్మల మరణించారనే వార్త తెలియగానే సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చేశారు.

ఆయన వెంట వై.ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు. విజయనిర్మల భౌతిక కాయానికి శుక్రవారం ఉదయం వారి సొంత గార్డెన్ విజయ క్రిష్ణలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

First Published:  28 Jun 2019 12:02 AM GMT
Next Story