Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ మూడో సీజన్ పై కీలక సమాచారం 

తెలుగు బుల్లి తెర పైన బిగ్ బాస్ షో ఎంత పెద్ద విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ షో రెండు సీజన్లు ముగించుకోని త్వరలో మూడో సీజన్ వైపు అడుగులు వేస్తుంది. అయితే ఈ షో కి సంబందించిన కీలక ప్రకటనలు ఇంకా నిర్వాహకులు చేయలేదు. హోస్ట్ గా నాగార్జున గురించి ప్రకటన జారీ చేయడం తో పాటు ఇతర వివరాలని కూడా త్వరలో నే తెలియజేయనున్నారు షో నిర్వాహకులు. ఈ నేపథ్యం లో […]

బిగ్ బాస్ మూడో సీజన్ పై కీలక సమాచారం 
X

తెలుగు బుల్లి తెర పైన బిగ్ బాస్ షో ఎంత పెద్ద విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ షో రెండు సీజన్లు ముగించుకోని త్వరలో మూడో సీజన్ వైపు అడుగులు వేస్తుంది. అయితే ఈ షో కి సంబందించిన కీలక ప్రకటనలు ఇంకా నిర్వాహకులు చేయలేదు. హోస్ట్ గా నాగార్జున గురించి ప్రకటన జారీ చేయడం తో పాటు ఇతర వివరాలని కూడా త్వరలో నే తెలియజేయనున్నారు షో నిర్వాహకులు.

ఈ నేపథ్యం లో ఈ షో కి సంబంధించి కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఈ సారి కేవలం 16 మంది కంటెస్టెంట్స్ తో నే షో ఉండబోతోందట. సెలెబ్రిటీస్ మాత్రమే ఈ షో లో పాల్గొంటారట.

ఇక కంటెస్టెంట్ ఒక్కసారి హౌస్ నుంచి బయటకు వెళ్తే ఎలిమినేటెడ్ గానే పరిగణిస్తారట. జులై 26 న మొదలెయ్యి ఈ షో మొత్తం వంద రోజులు ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఈ షో ని ఇంకా కొత్తగా విచిత్రమైన టాస్క్స్ తో డిసైన్ చేస్తున్నారట నిర్వాహకులు. రేపో ఎల్లుండో అన్ని వివరాల తో ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

First Published:  27 Jun 2019 9:24 PM GMT
Next Story