Telugu Global
Cinema & Entertainment

'కల్కి' సినిమా రివ్యూ

రివ్యూ: కల్కి రేటింగ్‌: 2.25/5 తారాగణం: రాజశేఖర్, అదా శర్మ, నందిత శ్వేతా, పూజిత పొన్నాడ, నాజర్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రానా, జయప్రకాష్, చంద్రదీప్, శత్రు తదితరులు సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ నిర్మాత: సి కళ్యాణ్ దర్శకత్వం: ప్రశాంత్ వర్మ ఈ మధ్యనే ‘పి.ఎస్.వి.గరుడవేగ’ అనే సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్… ఇప్పుడు ‘కల్కి’ అనే మరొక ఆసక్తికరమైన సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఈ […]

కల్కి సినిమా రివ్యూ
X

రివ్యూ: కల్కి
రేటింగ్‌: 2.25/5
తారాగణం: రాజశేఖర్, అదా శర్మ, నందిత శ్వేతా, పూజిత పొన్నాడ, నాజర్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రానా, జయప్రకాష్, చంద్రదీప్, శత్రు తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: సి కళ్యాణ్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

ఈ మధ్యనే ‘పి.ఎస్.వి.గరుడవేగ’ అనే సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్… ఇప్పుడు ‘కల్కి’ అనే మరొక ఆసక్తికరమైన సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే.

ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో అదాశర్మ, నందిత శ్వేత, పూజిత పొన్నాడ, నాజర్, అశుతోష్ రానా, జయ ప్రకాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది.

కథ మొత్తం కొల్లాపూర్ అనే ఊరిలో సాగుతుంది. శేఖర్ బాబు (సిద్ధు జొన్నలగడ్డ) అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ చావుతో ఊరిలో అన్ని పరిస్థితులు మారిపోతాయు. అసలు ఈ హత్య ఎవరు చేసారో తెలుసుకోవడానికి కల్కి (రాజశేఖర్) అనే పొలీస్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? కల్కి ఈ కేసు వెనుక మిస్టరీ ని సాల్వ్ చేశాడా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రాజశేఖర్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు అని చెప్పుకోవచ్చు. లుక్స్ పరంగా ఏజ్ ఎక్కువ కనిపించినా నటన పరంగా మాత్రం రాజశేఖర్ ఈ సినిమాలో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ని కనబరిచారు. ఈ సినిమా మొత్తం లో రాజశేఖర్ అద్భుతమైన నటన సినిమాకి వెన్నెముకగా చెప్పవచ్చు. అదా శర్మ అందంతోనే కాక అభినయంతో కూడా మెప్పించింది.

నందిత శ్వేతా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఎప్పటిలాగానే నాజర్, అశుతోష్ రానా లు నటించారు. పూజిత పొన్నాడ తన పాత్ర పరిధి మేరకు నటించింది. రాహుల్ రామకృష్ణ కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. శత్రు, జయప్రకాష్ కూడా మిగతా నటులతో పోటీపడుతూ నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకున్నప్పటికీ… దానిని తెరమీదకి సరిగ్గా ఎక్కించలేకపోయాడు. కొన్ని సన్నివేశాలను సాగదీయడంతో ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

సి కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాతలు సరిపడా బడ్జెట్ ని అందించారు.

శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం…. పాటలు పక్కనపెడితే ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకి బలాన్ని చేకూర్చింది. ఈ సినిమాలో సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది. రవి తేజ గిరిజాల ఎడిటింగ్ కూడా పరవాలేదనిపించింది.

బలాలు:

నటీనటులు, నేపధ్య సంగీతం

బలహీనతలు:

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

చివరి మాట:

సినిమాలో ఆసక్తికరమైన కథ ఉన్నప్పటికీ దర్శకుడు కొన్ని సన్నివేశాలను సాగదీయడం కొంచెం చిరాకు తెప్పిస్తుంది. సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది కానీ ఫస్టాఫ్ మొత్తం కథను ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోతుంది. ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తుంది.

కానీ సెకండ్ హాఫ్ లో కథ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా సాగిపోతుంది. అన్ని ట్విస్టులు ఒకేసారి రివీల్ చేసేస్తూ ఉండటంతో స్క్రీన్ ప్లే కొంచెం రష్ చేసినట్లు అనిపిస్తుంది. నటీనటులు మరియు నేపథ్య సంగీతం సినిమాలోని ప్లస్ పాయింట్లు. కథ పరవాలేదనిపించినా…. దానిని నెరేట్ చేసే విధానం ఇంకొంచెం బాగుంటే సినిమా ఇంకా బాగా వచ్చేదనిపిస్తుంది.

First Published:  28 Jun 2019 5:50 AM GMT
Next Story