Telugu Global
Cinema & Entertainment

సందీప్ రెడ్డి వెంట పడుతున్న.... విక్రమ్

తెలుగు లో అర్జున్ రెడ్డి సినిమా తో కల్ట్ స్టేటస్ సంపాదించాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత తెలుగు లో మహేష్ బాబు తో సినిమా చేయాల్సింది. కానీ సందీప్ ‘అర్జున్ రెడ్డి’ ని హిందీ లో కూడా చేసి భారీ హిట్ ని అందుకున్నాడు. హిందీ లో ఈ సినిమా ని షాహిద్ కపూర్, కైరా అద్వానీ హీరో హీరోయిన్లు గా చేశారు. తెలుగు లో ఎంత పెద్ద హిట్ అయిందో హిందీ […]

సందీప్ రెడ్డి వెంట పడుతున్న.... విక్రమ్
X

తెలుగు లో అర్జున్ రెడ్డి సినిమా తో కల్ట్ స్టేటస్ సంపాదించాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత తెలుగు లో మహేష్ బాబు తో సినిమా చేయాల్సింది. కానీ సందీప్ ‘అర్జున్ రెడ్డి’ ని హిందీ లో కూడా చేసి భారీ హిట్ ని అందుకున్నాడు.

హిందీ లో ఈ సినిమా ని షాహిద్ కపూర్, కైరా అద్వానీ హీరో హీరోయిన్లు గా చేశారు. తెలుగు లో ఎంత పెద్ద హిట్ అయిందో హిందీ లో ఈ సినిమా అంతకు మించిన విజయాన్ని సాధించింది.

ఇకపోతే ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా తమిళ రీమేక్ పైన ఉంది. డైరెక్టర్ బాల తప్పుకున్నాక…. తెలుగు అర్జున్ రెడ్డి కి పని చేసిన గిరిసయ్య ను ఈ సినిమా కి దర్శకుడిగా తీసుకున్నారు.

విక్రమ్…. ఎంత కష్టమైనా తన తనయుడుతో ఈ సినిమా చేయాలని పట్టు బట్టి మరీ ఈ సినిమా రైటర్స్ ను తీసుకున్నాడు. ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ని ఈ ఏడాది చివరిలో విడుదల చేస్తారు.

అయితే ఈ సినిమా ఫస్ట్ కాపీ రాగానే…. ఎలా అయినా సందీప్ కి చూపించి తన సలహాలని తీసుకోవాలని విక్రమ్ భావిస్తున్నాడట. తమిళం లో కూడా సందీప్ ఈ సినిమాకు సలహాలు ఇస్తే బాగుంటుంది అని విక్రమ్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాడని తెలుస్తోంది.

First Published:  27 Jun 2019 8:49 PM GMT
Next Story