Telugu Global
NEWS

చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించిన అధికారులు

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రజావేదికను కూల్చిన అధికారులు… ఇతర అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనానికి సీఆర్‌డీఏ అధికారులు వచ్చారు. లింగమనేని భవనానికి నోటీసులు అతికించారు. ఇది అక్రమ నిర్మాణమని ప్రకటించారు. వారం రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సీఆర్‌డీఏ అధికారులు గడువు ఇచ్చారు. నోటీసులు నేరుగా లింగమనేని భవనంలో ఉన్న పెద్దలకే ఇవ్వాలని అధికారులు భావించారు. […]

చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించిన అధికారులు
X

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రజావేదికను కూల్చిన అధికారులు… ఇతర అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనానికి సీఆర్‌డీఏ అధికారులు వచ్చారు. లింగమనేని భవనానికి నోటీసులు అతికించారు.

ఇది అక్రమ నిర్మాణమని ప్రకటించారు. వారం రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సీఆర్‌డీఏ అధికారులు గడువు ఇచ్చారు. నోటీసులు నేరుగా లింగమనేని భవనంలో ఉన్న పెద్దలకే ఇవ్వాలని అధికారులు భావించారు. అయితే వారిని చంద్రబాబు సిబ్బంది అనుమతించలేదు. దాంతో ఇంటి వెలుపల గేట్ వద్ద నోటీసులు అతికించారు.

చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట వెంబడి ఉన్న మరో 20 కట్టడాలకు కూడా సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. వారంలోగా అక్రమ కట్టడాలపై స్పందించాలని నోటీసుల్లో అక్రమకట్టడాల యజమానులకు గడువు ఇచ్చారు. అక్రమ కట్టడాలను తొలగించాలని…. లేనిపక్షంలో ప్రభుత్వమే ఆ పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

First Published:  27 Jun 2019 10:41 PM GMT
Next Story