Telugu Global
International

జొన్నతోటలో పేలిన బాంబు... 33 అడుగుల మేర గొయ్యి

జర్మనీలో భారీ బాంబు పేలుడు కలకలం రేపింది. ఒక రైతు జొన్న తోటలో హఠాత్తుగా భారీ బాంబు పేలింది. పేలుడు శబ్ధం దాదాపు పది కిలోమీటర్ల వరకు వినిపించింది. ఇంత భారీ పేలుడు ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. వెళ్లి చూడగా జొన్నతోటలో భారీ పేలుడు దృశ్యం కనిపించింది. పేలుడు వల్ల జొన్న తోటలో 33 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలిని పరిశీలించి 550 పౌండ్ల భారీ కెమికల్ బాంబు […]

జొన్నతోటలో పేలిన బాంబు... 33 అడుగుల మేర గొయ్యి
X

జర్మనీలో భారీ బాంబు పేలుడు కలకలం రేపింది. ఒక రైతు జొన్న తోటలో హఠాత్తుగా భారీ బాంబు పేలింది. పేలుడు శబ్ధం దాదాపు పది కిలోమీటర్ల వరకు వినిపించింది. ఇంత భారీ పేలుడు ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. వెళ్లి చూడగా జొన్నతోటలో భారీ పేలుడు దృశ్యం కనిపించింది.

పేలుడు వల్ల జొన్న తోటలో 33 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలిని పరిశీలించి 550 పౌండ్ల భారీ కెమికల్ బాంబు పేలినట్టు నిర్ధారించారు.

ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం నాటిదని తేల్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో శత్రు దేశాలు జర్మనీపై భారీగా బాంబులు జారవిడిచాయి. అందులో కొన్ని పేలలేదు. అవి ఇప్పటికీ అక్కడక్కడ పేలుతుంటాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం పేలుడు జరిగిన జొన్నతోట వద్ద గతంలో రైల్వే డిపో ఉండేదని… దాన్ని టార్గెట్‌గా చేసుకుని బాంబుల దాడి జరిగిందని… అయితే తాజాగా పేలిన బాంబు గతంలో భూమిలోకి చొచ్చుకెళ్లి పేలకుండా ఉండిపోయినట్టు భావిస్తున్నారు.

ఇన్నాళ్లకు అది యాక్టివేట్ అయి పేలినట్టు చెబుతున్నారు. ఈ భారీ పేలుడు నేపథ్యంలో చుట్టూ పక్కల ఇంకా బాంబులు ఉన్నాయా అన్న దానిపై సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అధికారులు సోదాలు చేస్తున్నారు.

First Published:  25 Jun 2019 10:44 PM GMT
Next Story