Telugu Global
International

అతిగా పని చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..!

ఇప్పుడంతా ఉరుకుల పరుగుల ప్రపంచమే. సంపాదన కోసం గంటల కొద్దీ పని చేయక తప్పట్లేదు. డబ్బు ఎక్కువ వస్తుందనో.. ప్రమోషన్ కోసమో ఉద్యోగులు నిర్ణీత పని వేళల కంటే ఎక్కువ సేపు పని చేస్తున్నారంతా. ఇలాంటి వారు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చైనాకు చెందిన సీసీటీవీ అనే మీడియా సంస్థ వెల్లడించింది. చైనాలో అతిగా పని చేయడం వల్ల ఒక ఏడాది 6 లక్షల మందికి పైగా మరణించారట. గతంలో జపాన్‌లో అత్యధిక పని వల్ల […]

అతిగా పని చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..!
X

ఇప్పుడంతా ఉరుకుల పరుగుల ప్రపంచమే. సంపాదన కోసం గంటల కొద్దీ పని చేయక తప్పట్లేదు. డబ్బు ఎక్కువ వస్తుందనో.. ప్రమోషన్ కోసమో ఉద్యోగులు నిర్ణీత పని వేళల కంటే ఎక్కువ సేపు పని చేస్తున్నారంతా. ఇలాంటి వారు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చైనాకు చెందిన సీసీటీవీ అనే మీడియా సంస్థ వెల్లడించింది.

చైనాలో అతిగా పని చేయడం వల్ల ఒక ఏడాది 6 లక్షల మందికి పైగా మరణించారట. గతంలో జపాన్‌లో అత్యధిక పని వల్ల మరణాలు సంభవించేవి. కాని చైనా ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది. ఈ మరణాల్లో అత్యధిక శాతం మంది యువతే కావడం గమనార్హం.

అత్యధిక పని వేళల్లో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఐటీ, మీడియా, మెడికల్, అడ్వర్టైజ్‌మెంట్ రంగాలకు చెందిన వారేనట. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్ వృద్ధి కోసం కనీసం ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అతిగా పని చేస్తుండటం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని సీసీటీవీ వెల్లడించింది.

కేవలం పని వేళలే కాకుండా ఆఫీసు నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసుకు చేసే ప్రయాణం.. పని ఒత్తిడి.. కుటుంబం ద్వారా పెరిగే ఒత్తిడి వీరి మానసిక స్థితిని మరింత క్షీణింప చేస్తోందని సదరు మీడియా సంస్థ రిపోర్టులో పేర్కొంది.

First Published:  25 Jun 2019 9:43 PM GMT
Next Story