Telugu Global
International

పీకల్లోతు కష్టాలలో అలనాటి టెన్నిస్ గ్రేట్

అప్పులు తీర్చడానికి ట్రోఫీలు, జ్ఞాపికల వేలం పాపం! బోరిస్ బెకర్ అంటున్న అభిమానులు జర్మన్ టెన్నిస్ దిగ్గజం, అలనాటి వింబుల్డన్ చాంపియన్ బోరిస్ బెకర్ పరిస్థితి ఇంతబతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. అతిపిన్న వయసులో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిన బూమ్ బూమ్ బెకర్.. టెన్నిస్ స్టార్ గా సంపాదించిన కోట్ల డాలర్లను కుటుంబ సమస్యలతో పాటు వివిధ కారణాలతో నష్టపోయాడు. వెనుకాముందు చూసుకోకుండా అందినచోటల్లా అప్పులు చేసి ..చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. […]

పీకల్లోతు కష్టాలలో అలనాటి టెన్నిస్ గ్రేట్
X
  • అప్పులు తీర్చడానికి ట్రోఫీలు, జ్ఞాపికల వేలం
  • పాపం! బోరిస్ బెకర్ అంటున్న అభిమానులు

జర్మన్ టెన్నిస్ దిగ్గజం, అలనాటి వింబుల్డన్ చాంపియన్ బోరిస్ బెకర్ పరిస్థితి ఇంతబతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది.

అతిపిన్న వయసులో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిన బూమ్ బూమ్ బెకర్.. టెన్నిస్ స్టార్ గా సంపాదించిన కోట్ల డాలర్లను కుటుంబ సమస్యలతో పాటు వివిధ కారణాలతో నష్టపోయాడు.

వెనుకాముందు చూసుకోకుండా అందినచోటల్లా అప్పులు చేసి ..చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
అప్పుల ఊబినుంచి బయటపడటానికి బెకర్ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు దివాళా తీసిన పరిస్థితిలోనూ ఎలాగో ఒకలాగా అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.

టెన్నిస్ ప్లేయర్ గా, గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేతగా తాను సాధించిన ట్రోఫీలు, పతకాలు, జ్ఞాపికలను ఆన్ లైన్ ద్వారా వేలానికి ఉంచాడు.

వేలం ద్వారా వచ్చిన మొత్తంతో ఎంతోకొంత మేరకు అప్పులు తీర్చాలని భావిస్తున్నాడు.

మొత్తం 82 రకాల ట్రోఫీలు, జ్ఞాపికలు, పతకాలను వేలానికి పెట్టాడు. కేవలం 17 సంవత్సరాల వయసుకే మూడు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన తొలి, ఏకైక ఆటగాడిగా నిలిచిన బెకర్ వివాహ జీవితం సైతం మూడు పెళ్లిళ్లు-ఆరు విడాకులు అన్నట్లుగా ముగిసిపోయింది.

ప్రస్తుతం 51 సంవత్సరాల వయసులో బెకర్ నానాపాట్లు పడుతున్నాడు. ఆర్ధిక సమస్యలతో విలవిలలాడుతున్నాడు.

First Published:  25 Jun 2019 7:02 PM GMT
Next Story