Telugu Global
NEWS

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్ " ఎమ్మెల్యే ఆర్కే

ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు మేనేజ్ చేయగల సత్తా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. “ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ కృష్ణానది కరకట్టపై వెలసిన కట్టడాలపై హైకోర్టు నోటీసులు ఇచ్చినా… ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వాటిని ఖాతరు చేయలేదు. ఆయన కోర్టులనే కాదు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలరు” అని ఓ ఛానెల్ లో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న ఆర్కే […]

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్  ఎమ్మెల్యే ఆర్కే
X

ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు మేనేజ్ చేయగల సత్తా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

“ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ కృష్ణానది కరకట్టపై వెలసిన కట్టడాలపై హైకోర్టు నోటీసులు ఇచ్చినా… ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వాటిని ఖాతరు చేయలేదు. ఆయన కోర్టులనే కాదు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలరు” అని ఓ ఛానెల్ లో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న ఆర్కే తెలిపారు.

కృష్ణానది కరకట్టపై ఉన్న 60, 70 అక్రమ కట్టడాలపై తాను 2015 సంవత్సరంలోనే కోర్టును ఆశ్రయించానని, వాటిపై హైకోర్టు స్పందించి ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసిందని ఆర్కే తెలిపారు. ఆ సమయంలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి హడావుడిగా అమరావతికి వచ్చేసారని, వచ్చిన వెంటనే ఇక్కడ ప్రజావేదిక పేరుతో అక్రమ కట్టడాన్ని నిర్మించారని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.

హైదరాబాద్ నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాజధానికి వచ్చిన చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయడం అప్పటి నుంచే ఎక్కువ చేశారని చర్చాగోష్టిలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి వివరించారు.

కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై తాను మళ్లీ హై కోర్టును ఆశ్రయించానని, దీంతో 58 అక్రమ కట్టడాలపై హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే చెప్పారు. హైకోర్టు ఇచ్చిన నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ఆ మాటే మరిచిపోయిందని ఆర్కే తెలిపారు.

కరకట్టపై నిర్మించిన అక్రమకట్టడాలను కూల్చి వేయక తప్పదని, ఆ పనిని ముందుగా ప్రజావేదిక కట్టడం నుంచి ప్రారంభిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అల్లా రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. “కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నింటిని కూల్చి వేసేందుకు అతి త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తాయి” అని ఆర్కే స్పష్టం చేశారు.

First Published:  24 Jun 2019 9:20 PM GMT
Next Story