Telugu Global
NEWS

నేడు, రేపు కలెక్టర్లతో సమావేశం.... చర్చకు వచ్చే అంశాలు ఇవే....

ఆంధ్రప్రదేశ్ లో పాలనను పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం, మంగళవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్లతో సమావేశం కావడం ఇదే తొలిసారి. జిల్లాలలో పరిస్థితులను కలెక్టర్ల నుంచి నివేదికల ద్వారా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల […]

నేడు, రేపు కలెక్టర్లతో సమావేశం.... చర్చకు వచ్చే అంశాలు ఇవే....
X

ఆంధ్రప్రదేశ్ లో పాలనను పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం, మంగళవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్లతో సమావేశం కావడం ఇదే తొలిసారి. జిల్లాలలో పరిస్థితులను కలెక్టర్ల నుంచి నివేదికల ద్వారా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు.

ఇందులో భాగంగా రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ లతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉపముఖ్యమంత్రులు, మంత్రులు కూడా పాల్గొంటారు. అమ్మ ఒడి పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం ప్రభుత్వపాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలో కూడా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులకు 15 వేల రూపాయలు అందజేసే బృహత్తర పథకంపై ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్రంలో అందరికీ వైద్యం అందించే పథకంతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యంగా మారిన 104, 108 సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు మరింత మెరుగైన సేవలను అందించేలా చర్యలు తీసుకోనున్నారు. తాను పాదయాత్ర లో ప్రకటించిన నవరత్నాలు పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో జగన్ కలెక్టర్లకు వివరించనున్నారు.

ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ వాలంటీర్ల నియామకాలు వంటి అంశంపై ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఆగస్టు 15న గ్రామ వాలంటీర్ల నియామకాలు జరుగుతాయి కాబట్టి…. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు వివిధ కార్యక్రమాలను గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు చేరవేయాలని జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయడంలో భాగంగా తొలివిడతగా బెల్టు షాపులను ఎత్తివేయడంపై కలెక్టర్ల సమావేశంలో చర్చిస్తారు. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేయడంతో పాటు మద్యపానం వల్ల వచ్చే అనర్థాలను ప్రజలకు వివరించాలని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు సహకరించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరే అవకాశం ఉంది. రాష్ట్ర్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగరాదని, సంఘ వ్యతిరేక శక్తులను కఠినంగా శిక్షించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించే అవకాశాలున్నాయి.

First Published:  23 Jun 2019 9:25 PM GMT
Next Story