Telugu Global
NEWS

ప్రపంచకప్ లో కొహ్లీ ఓవర్ యాక్షన్

మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా అంపైర్ తో వాగ్వాదానికి శిక్ష భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి జరిమాన దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా…అఫ్ఘనిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో…అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడమే కాకుండా.. వాగ్వాదానికి దిగటం, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా, దూకుడుగా వ్యవహరించడాన్ని ఐసీసీ మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణించారు. నలుగురు అంపైర్ల ఫిర్యాదు… సౌతాంప్టన్ హాంప్ షైర్ బౌల్ వేదికగా […]

ప్రపంచకప్ లో కొహ్లీ ఓవర్ యాక్షన్
X
  • మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా
  • అంపైర్ తో వాగ్వాదానికి శిక్ష

భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి జరిమాన దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా…అఫ్ఘనిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో…అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడమే కాకుండా.. వాగ్వాదానికి దిగటం, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా, దూకుడుగా వ్యవహరించడాన్ని ఐసీసీ మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణించారు.

నలుగురు అంపైర్ల ఫిర్యాదు…

సౌతాంప్టన్ హాంప్ షైర్ బౌల్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో… అఫ్గనిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆట 29వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకొంది.

జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో రెహ్మత్ షా ను అవుటైనట్లు ప్రకటించాలంటూ…కొహ్లీ మితిమీరి అప్పీలు చేశాడు. ఫీల్డ్ అంపైర్ పైకి దూకుడుగా వెళ్లాడు.

ఓ జట్టుకు కెప్టెన్ గా, ప్రపంచ టాప్ ర్యాంక్ ఆటగాడిగా ఉన్న కొహ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడాన్ని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తీవ్రంగా పరిగణించారు.

మ్యాచ్ ను పర్యవేక్షించిన ఫీల్డ్ అంపైర్లు అలీం ధర్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్,థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో, నాలుగో అంపైర్ మైకేల్ గాఫ్ కలసి… కొహ్లీ పైన ఫిర్యాదు చేశారు.

కొహ్లీకి 2 డీమెరిట్ పాయింట్లు…

ఐసీసీకోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధన 1 ప్రకారం కొహ్లీ పైన మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించే అవకాశం ఉంది. అయితే…కొహ్లీ మ్యాచ్ ఫీజు 7 లక్షల రూపాయలలో 25 శాతం జరిమానాగా విధించడంతో పాటు…ఓ డీమెరిట్ పాయింట్ ను సైతం ఇచ్చినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. తనపై నలుగురు అంపైర్లు చేసిన ఫిర్యాదును కొహ్లీ సైతం ఆమోదించక తప్పలేదు.

గతంలోనే దూకుడుగా వ్యవహరించిన కారణంగా ఓ డీమెరిట్ పాయింట్ ఉన్న కొహ్లీ..ప్రస్తుత తప్పిదంతో రెండోపాయింట్ ను సైతం తన ఖాతాలో వేసుకోక తప్పలేదు.

రెండు డీమెరిట్ పాయింట్లు పొందిన ఆటగాడిని ఓ టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు…లేదా రెండు టీ-20 మ్యాచ్ లు ఆడకుండా సస్పెన్షన్ విధించే అవకాశం ఉంది. అయితే ఈ శిక్షను 24 నెలల సమయంలో ఎప్పుడైన అనుభవించే వెసలుబాటును ఐసీసీ కల్పించింది.

క్రికెట్ ఫీల్డ్ లో అంపైర్లతో వాగ్వాదానికి దిగటం విరాట్ కొహ్లీకి ఓ అలవాటుగా ఉంటూ వస్తోంది. మరోవైపు ఫీల్డ్ లో దూకుడుగా ఉండే విరాట్ కొహ్లీ సంయమనం పాటించాలంటూ క్రికెట్ పండితులు సలహా ఇస్తున్నారు.

First Published:  24 Jun 2019 1:34 AM GMT
Next Story