Telugu Global
Cinema & Entertainment

వాళ్లకి పనిపాట లేదు.... పైగా ఫ్రీ డేటా ప్లాన్లు.... " రకుల్

సెలబ్రిటీ లు అన్నాక కేవలం పొగడ్తలు మాత్రమే కాక విమర్శలు కూడా అందుకుంటూనే ఉంటారు. పైగా సోషల్ మీడియా ప్రభావం వల్ల ట్రోలర్లు కూడా పెరిగి పోయారు. కొందరు సెలబ్రిటీలు ఆన్ లైన్ లో ట్రోలింగ్ పెద్దగా పట్టించుకోరు కానీ…. కొందరు మాత్రం అవకాశం దొరికినప్పుడు వాళ్లపై మండిపడుతూ ఉంటారు. తాజాగా ట్రోలింగ్ పై రియాక్ట్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. గత కొంతకాలంగా తెలుగు లో తక్కువ… కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు […]

వాళ్లకి పనిపాట లేదు....  పైగా ఫ్రీ డేటా ప్లాన్లు....  రకుల్
X

సెలబ్రిటీ లు అన్నాక కేవలం పొగడ్తలు మాత్రమే కాక విమర్శలు కూడా అందుకుంటూనే ఉంటారు. పైగా సోషల్ మీడియా ప్రభావం వల్ల ట్రోలర్లు కూడా పెరిగి పోయారు.

కొందరు సెలబ్రిటీలు ఆన్ లైన్ లో ట్రోలింగ్ పెద్దగా పట్టించుకోరు కానీ…. కొందరు మాత్రం అవకాశం దొరికినప్పుడు వాళ్లపై మండిపడుతూ ఉంటారు. తాజాగా ట్రోలింగ్ పై రియాక్ట్ అయింది రకుల్ ప్రీత్ సింగ్.

గత కొంతకాలంగా తెలుగు లో తక్కువ… కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న రకుల్ ఆన్ లైన్ లో ట్రోలింగ్ పై రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వాళ్ళకు పని పాట లేదని మండిపడింది.

“దేశంలో పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా ఫ్రీ డేటా ప్లాన్లు కూడా ఉండడంతో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి చేయడానికి పెద్దగా పని లేని వాళ్ళు అందరూ వేరొకరి పై కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయినా నా తల్లిదండ్రులకు మరియు నా స్నేహితులకు అభ్యంతరం లేనప్పుడు నేను సోషల్ మీడియాలో ఏదైనా ఫొటో పెట్టాలి అనుకున్నప్పుడు ఎందుకు భయపడాలి? నేను మిగతా వారి గురించి పట్టించుకోను. ఎందుకంటే మనం అందరనీ మెప్పించలేము” అంటూ కరాకండి గా చెప్పేసింది రకుల్.

ఇక సినిమాల పరంగా రకుల్ ప్రీత్ నాగార్జున హీరోగా నటిస్తున్న ‘మన్మధుడు 2’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

First Published:  24 Jun 2019 5:37 AM GMT
Next Story