Telugu Global
NEWS

అంబికా కూడా జంప్

టీడీపీ నేతలు టీడీపీని వరుసగా వీడుతున్నారు. చంద్రబాబు హయాంలో లాభపడిన వారు కూడా ఇప్పుడు ఇక బాబుతో లాభం లేదనుకుని వెళ్లిపోతున్నారు. వీరి జాబితాలో అంబికా కృష్ణ కూడా చేరారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే అంబికా కృష్ణను ఫిల్మ్, టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూడా నియమించారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత పదవికి రాజీనామా చేసిన అంబికా…ఇప్పుడు టీడీపీకి కూడా రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. బాబుతో భక్తుడి అనుబంధం తెగిపోనుంది. త్వరలోనే ఆయన బీజేపీలో […]

అంబికా కూడా జంప్
X

టీడీపీ నేతలు టీడీపీని వరుసగా వీడుతున్నారు. చంద్రబాబు హయాంలో లాభపడిన వారు కూడా ఇప్పుడు ఇక బాబుతో లాభం లేదనుకుని వెళ్లిపోతున్నారు. వీరి జాబితాలో అంబికా కృష్ణ కూడా చేరారు.

చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే అంబికా కృష్ణను ఫిల్మ్, టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూడా నియమించారు.

ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత పదవికి రాజీనామా చేసిన అంబికా…ఇప్పుడు టీడీపీకి కూడా రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు.

బాబుతో భక్తుడి అనుబంధం తెగిపోనుంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతున్నారు. బాబుతోనే కాకుండా బాలకృష్ణతోనూ అంబికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్య మాజీ మంత్రి పీతల సుజాతపై నోరు పారేసుకోవడం ద్వారా అంబికా కృష్ణ టీడీపీలో కలకలం రేపారు.

First Published:  24 Jun 2019 2:35 AM GMT
Next Story