Telugu Global
Cinema & Entertainment

సినిమాలో ఉంటాను.... కానీ మహేష్ తో సీన్స్ లేవు....

అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా త్వరలో ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా కి సరిలేరు నీకెవరు అనే టైటిల్ ని ఖరారు చేసారు చిత్ర యూనిట్. అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ సినిమా లో కొంత మంది సీనియర్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందులో విజయ శాంతి కూడా ఒకరు. 13 ఏళ్ళ తర్వాత విజయ శాంతి ఈ సినిమా తో మళ్ళీ తెలుగు […]

సినిమాలో ఉంటాను.... కానీ మహేష్ తో సీన్స్ లేవు....
X

అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా త్వరలో ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా కి సరిలేరు నీకెవరు అనే టైటిల్ ని ఖరారు చేసారు చిత్ర యూనిట్.

అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ సినిమా లో కొంత మంది సీనియర్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందులో విజయ శాంతి కూడా ఒకరు. 13 ఏళ్ళ తర్వాత విజయ శాంతి ఈ సినిమా తో మళ్ళీ తెలుగు పరిశ్రమ లో కి అడుగు పెడుతున్న నేపథ్యం…. ఈ సినిమా లో పాత్ర గురించి చాలా పుకార్లు బయటకు వస్తున్నాయి. కాకపోతే ఆవిడ నెగటివ్ రోల్ లో కనిపిస్తుంది అని కొందరు, మహేష్ బాబు కి తల్లి గా కనిపిస్తుంది అని కొందరు చెప్తున్న నేపథ్యం లో, విజయ శాంతి తన పాత్ర గురించి ఒక క్లారిటీ ఇచ్చారు.

ఇటీవలే మీడియా తో మాట్లాడుతూ… తన పాత్ర లో ఎటువంటి నెగటివ్ ఛాయలు లేవని ఆవిడ క్లారిటీ ఇచ్చారు. షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈ సినిమా లో విజయ శాంతి పోషించే పాత్ర కి మహేష్ బాబు కి అసలు సంబంధం లేదట.

అంటే ఈ సినిమా లో వీరిద్దరికీ సీన్లు ఉంటాయి అనుకోవడం కూడా అసాధ్యమే. దర్శకుడు విజయ శాంతి పాత్ర ని ఎలా తీర్చిదిద్దారో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  23 Jun 2019 8:17 AM GMT
Next Story