Telugu Global
Cinema & Entertainment

అరుంధతిగా పాయల్ రాజ్ పుత్

ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ కొట్టిన పాయల్ రాజ్ పుత్ కు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సీత సినిమాలో ఐటెంసాంగ్ చేసిన ఈ బ్యూటీ, వెంకీమామ సినిమాలో ఏకంగా వెంకటేశ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఆమె నటించబోతోంది. పాయల్ లీడ్ రోల్ లో అరుంధతి-2 అనే సినిమా ప్రకటించారు. ఈ సినిమా కోసం ఆమె కత్తియుద్ధం, గుర్రపుస్వారీ నేర్చుకోబోతోంది. పైగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. […]

అరుంధతిగా పాయల్ రాజ్ పుత్
X

ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ కొట్టిన పాయల్ రాజ్ పుత్ కు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సీత సినిమాలో ఐటెంసాంగ్ చేసిన ఈ బ్యూటీ, వెంకీమామ సినిమాలో ఏకంగా వెంకటేశ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఆమె నటించబోతోంది.

పాయల్ లీడ్ రోల్ లో అరుంధతి-2 అనే సినిమా ప్రకటించారు. ఈ సినిమా కోసం ఆమె కత్తియుద్ధం, గుర్రపుస్వారీ నేర్చుకోబోతోంది. పైగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు నటించబోతున్నారు. ఇలా భారీ స్థాయిలో రాబోతోంది అరుంధతి-2.

శ్రీ శంకుచక్ర బ్యానర్ పై కోటితూముల ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని మరో 2 పెద్ద బ్యానర్లను కూడా సహ-నిర్మాతగా చేర్చుకోబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ వెంటనే ట్రైనింగ్ కోసం పాయల్ ముంబయి వెళ్తుందట. ఆమె శిక్షణ పూర్తయిన తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈలోగా నటీనటుల్ని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు.

First Published:  23 Jun 2019 10:00 AM GMT
Next Story