Telugu Global
International

వాట్సాప్ సంచలన నిర్ణయం

సోషల్ మీడియాలో ఇప్పుడు వాట్సాప్ ప్రభావం మామూలుగా లేదు.. సోషల్ మీడియా ప్రభావానికి ప్రపంచంలోని ప్రభుత్వాలు కూడా వణికిపోతున్నాయి. తప్పుడు సమాచారం కావాచ్చు.. సక్రమ సమాచారం అయినా ప్రపంచం నలూమూలలకు సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో చేరుతోంది. ఇందులో ప్రధాన భూమిక పోషిస్తోంది వాట్సాప్. ఈ సోషల్ మీడియా ప్రభావానికి కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే కుప్పకూలుతున్నాయి. మరికోన్ని దేశాల్లో ఉద్యమాలు వీటిమీదే పురుడుపోసుకున్నాయి. అయితే ఎంతో క్రియాశీలంగా ఉన్న ఈ సోషల్ మీడియా దిగ్గజం ఇప్పుడు అసత్య […]

వాట్సాప్ సంచలన నిర్ణయం
X

సోషల్ మీడియాలో ఇప్పుడు వాట్సాప్ ప్రభావం మామూలుగా లేదు.. సోషల్ మీడియా ప్రభావానికి ప్రపంచంలోని ప్రభుత్వాలు కూడా వణికిపోతున్నాయి. తప్పుడు సమాచారం కావాచ్చు.. సక్రమ సమాచారం అయినా ప్రపంచం నలూమూలలకు సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో చేరుతోంది. ఇందులో ప్రధాన భూమిక పోషిస్తోంది వాట్సాప్. ఈ సోషల్ మీడియా ప్రభావానికి కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే కుప్పకూలుతున్నాయి. మరికోన్ని దేశాల్లో ఉద్యమాలు వీటిమీదే పురుడుపోసుకున్నాయి.

అయితే ఎంతో క్రియాశీలంగా ఉన్న ఈ సోషల్ మీడియా దిగ్గజం ఇప్పుడు అసత్య సమాచారం అడ్డుకోవడంపై దృష్టిసారించింది. వాట్సాప్ పై ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

తప్పుడు వార్తల ప్రచారం వెనుక సృష్టికర్త ఎవరో తెలుసుకునేందుకు వాట్సాప్ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. డిజిటల్ సంతకం అనే ఫిచర్ ను వాట్స్ అప్ అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ఎవరు ఒక సమాచారం వెనుక ఉన్నారనేది ఇట్టే తెలిసిపోతుంది. దాంతో ఫేక్ న్యూస్ లు సృష్టించే వారి బండారం బట్టబయలు కావడం ఖాయం. అంతేకాదు వారిపై కఠిన చర్యలకు అస్కారం కల్పించేలా వాట్సాప్ టెక్నాలజీలో మార్పులు తెస్తోంది.

ఈ ఫీచర్ ను త్వరలోనే వాట్సాప్ ప్రవేశ పెట్టనుంది. దీనినే డిజిటల్ సంతకంగా చెబుతున్నారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టు వాట్స్ అప్ యాజమాన్యం పేర్కోంటుంది.

ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్ లలో గ్రూప్ చాటింగ్ కి సంబందించి వాటిని పరిశీలించి చర్యలు తీసుకునేలా పోలీసులకు అధికారాన్ని కట్టబెట్టాయి కూడా. భారత్ కూడా ఫేక్ న్యూస్ నిరోధానికి చర్యలు చేపట్టాలని ఇప్పటికే వాట్స్ ఆప్ ను కోరింది. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోతున్న డిజిటల్ సంతకం తప్పుడు వార్తలు సృష్టించే వారిని కటకటాల పాలు చేయడం ఖాయమంటున్నారు.

First Published:  22 Jun 2019 4:35 AM GMT
Next Story