Telugu Global
Cinema & Entertainment

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శర్వానంద్

షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన నాగశౌర్య రీసెంట్ గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు శర్వానంద్ కూడా డిశ్చార్జ్ అయ్యాడు. శర్వానంద్ ను మరోసారి పూర్తిగా పరీక్షించిన డాక్టర్ గురవారెడ్డి.. అతడ్ని ఇంటికి పంపించారు. 2 నెలల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. బ్యాంకాక్ లో జరిగిన షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు శర్వానంద్. 96 సినిమా షూటింగ్ కోసం పారా గ్లైడింగ్ చేస్తూ తప్పుగా ల్యాండ్ అయ్యాడు. […]

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శర్వానంద్
X

షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన నాగశౌర్య రీసెంట్ గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు శర్వానంద్ కూడా డిశ్చార్జ్ అయ్యాడు. శర్వానంద్ ను మరోసారి పూర్తిగా పరీక్షించిన డాక్టర్ గురవారెడ్డి.. అతడ్ని ఇంటికి పంపించారు. 2 నెలల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

బ్యాంకాక్ లో జరిగిన షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు శర్వానంద్. 96 సినిమా షూటింగ్ కోసం పారా గ్లైడింగ్ చేస్తూ తప్పుగా ల్యాండ్ అయ్యాడు. దీంతో అతడి భుజానికి తీవ్రంగా గాయమైంది. వైద్యులు 11 గంటల పాటు శ్రమించి, అతడి భుజానికి శస్త్రచికిత్స పూర్తిచేశారు. అలా 5 రోజులుగా హాస్పిటల్ లోనే ఉన్న శర్వానంద్ ఇప్పుడు ఇంటికి వెళ్లాడు.

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రణరంగం, 96 సినిమాలున్నాయి. రణరంగం సినిమా విడుదలకు ఎలాంటి సమస్య లేదు. అది ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. కాకపోతే ఆ సినిమా ప్రమోషన్లకు శర్వానంద్ అందుబాటులోకి వస్తాడా రాడా అనేది డౌట్. ఇక 96 సినిమా షెడ్యూల్ మాత్రం 2 నెలల తర్వాత పెట్టుకోవాల్సిందే.

First Published:  22 Jun 2019 1:54 AM GMT
Next Story