Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సరసన పూజా హెగ్డే.... నమ్మేలా ఉందా!

హీరోయిన్ ఎవరో తేల్చకుండానే అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంది. అందుకే ఓ స్టార్ హీరోయిన్ తో ఆ క్యారెక్టర్ చేయిద్దామని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఎవరా స్టార్ హీరోయిన్ అనే చోట బండి ఆగిపోయింది. తాజాగా ఈ లిస్ట్ లో పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. అవును.. అఖిల్ సినిమాలో పూజా హెగ్డేను తీసుకుంటారనే ప్రచారం నడుస్తోంది. కానీ లాజికల్ గా […]

అఖిల్ సరసన పూజా హెగ్డే.... నమ్మేలా ఉందా!
X

హీరోయిన్ ఎవరో తేల్చకుండానే అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంది. అందుకే ఓ స్టార్ హీరోయిన్ తో ఆ క్యారెక్టర్ చేయిద్దామని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఎవరా స్టార్ హీరోయిన్ అనే చోట బండి ఆగిపోయింది. తాజాగా ఈ లిస్ట్ లో పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.

అవును.. అఖిల్ సినిమాలో పూజా హెగ్డేను తీసుకుంటారనే ప్రచారం నడుస్తోంది. కానీ లాజికల్ గా ఆలోచిస్తే ఇందులో సగమే నిజం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉంది. ఆమె చేతిలో తెలుగు-తమిళ భాషలు కలుపుకొని 3 సినిమాలున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమె అఖిల్ సినిమా కోసం కాల్షీట్లు కేటాయిస్తుందని అనుకోలేం. అందుకే ఈ వార్తను ఎవ్వరూ పెద్దగా నమ్మడం లేదు.

కానీ పూజా హెగ్డే దగ్గర ఓ సౌకర్యం ఉంది. కాస్త రెమ్యూనరేషన్ పెంచితే ఎలాగోలా ఆమె కాల్షీట్లు ఎడ్జస్ట్ చేస్తుంది. ఎందుకంటే రోజుకు 3 షిఫ్టుల్లో కూడా పనిచేసేంత సత్తా తనకు ఉందని గతంలోనే ఈ ముద్దుగుమ్మ ప్రకటించిన విషయం తెలిసిందే. సో.. కాస్త సీరియస్ గా సంప్రదింపులు జరిపితే పూజా హెగ్డేను ఒప్పించడం పెద్ద సమస్య కాదంటున్నారు ఆమె గురించి బాగా తెలిసిన వాళ్లు. ఈనెల 26 నుంచి అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. ఆ లోపు ఓ స్పష్టత వస్తుందేమో చూడాలి.

First Published:  21 Jun 2019 8:15 PM GMT
Next Story