Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య తో... కీర్తి సురేష్

గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య వెంకటేష్ తో ‘వెంకీ మామ’ అనే ఒక మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. […]

నాగచైతన్య తో... కీర్తి సురేష్
X

గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య వెంకటేష్ తో ‘వెంకీ మామ’ అనే ఒక మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మరోవైపు నాగచైతన్య ‘బంగార్రాజు’ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున మరియు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించేందుకు కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన ‘మహానటి’ సినిమాలో నాగచైతన్య నాగేశ్వరరావు పాత్రలో కనిపించారు.

ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ ‘బంగార్రాజు’ సినిమాలో కలిసి నటించబోతున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

First Published:  22 Jun 2019 6:17 AM GMT
Next Story