Telugu Global
NEWS

మిమ్మల్ని ఏపీలో తిరగనివ్వం " టిడిపి నేతలు

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో సహా తెలుగుదేశం పార్టీ నుంచి బిజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులపై తెలుగుదేశం నాయకులు విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యుల చేరికపై తీవ్ర స్దాయిలో ధ్వజమెత్తారు. “పార్టీ వీడిన వారిని ఆంధ్రప్రదేశ్ లో తిరగనివ్వం… ప్రజలు మిమ్మల్ని ఛీ కొడుతున్నారు ” అని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతీవ్ర స్దాయిలో మండిపడ్డారు. “మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు. బ్యాంకు రుణాలు ఎగ్గొటేందుకే […]

మిమ్మల్ని ఏపీలో తిరగనివ్వం  టిడిపి నేతలు
X

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో సహా తెలుగుదేశం పార్టీ నుంచి బిజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులపై తెలుగుదేశం నాయకులు విరుచుకుపడ్డారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యుల చేరికపై తీవ్ర స్దాయిలో ధ్వజమెత్తారు.

“పార్టీ వీడిన వారిని ఆంధ్రప్రదేశ్ లో తిరగనివ్వం… ప్రజలు మిమ్మల్ని ఛీ కొడుతున్నారు ” అని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతీవ్ర స్దాయిలో మండిపడ్డారు.

“మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు. బ్యాంకు రుణాలు ఎగ్గొటేందుకే మీరు పార్టీ మారారు” అని బుద్ద వెంకన్న అన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నాయకులకు బుద్ది చెబుతారని మరో నాయకుడు దేవినేని ఉమ అన్నారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న వారిని ప్రజలు తిప్పికొడతారని, అధికారం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని దేవినేని ఉమ అన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో ఒక్క కార్యకర్త కూడా చెక్కు చెదరలేదని, కేసులు ఉన్న నాయకులే పార్టీ మారుతున్నారని ఆయన అన్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు పార్టీ మారడంపై న్యాయ సలహా తీసుకుంటామని అన్నారు.

పార్టీ “రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం మూడ్ ఆఫ్ ది నేషన్ అంటున్నారు. ఇది ఎంతమాత్రం తగదు” అని గల్లా జయదేవ్ చెప్పారు.

ఇక రాజ్యసభ మరో సభ్యుడు కనకమేడల మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం బాధాకరమని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ వీడిపోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

పార్టీ మారిన నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మరో సీనియర్ నాయకుడు గద్దె రాంమోహన్ వ్యాఖ్యానించారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో గద్దె రాంమోహన్ మాట్లాడుతూ… పార్టీ కష్ట కాలంలో ఉండగా రాజ్యసభ సభ్యులు ఇలా పార్టీ వీడడం భావ్యం కాదన్నారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండి ఇప్పుడు పార్టీ మారడం వారి అవకాశవాద రాజకీయాలను తెలియజేస్తోందని ధ్వజమెత్తారు.

అయితే వాళ్ళను పార్టీ మారమని సలహా ఇచ్చిందే చంద్రబాబు కాబట్టి…. ఈ టీడీపీ నాయకులు తిట్టదలుచుకుంటే చంద్రబాబును తిట్టాలి గానీ పార్టీ మారిన వాళ్ళను తిట్టడం దేనికి? అని టీడీపీలో కొందరు నాయకులు అంటున్నారు.

First Published:  20 Jun 2019 8:36 PM GMT
Next Story