Telugu Global
Cinema & Entertainment

మొన్నటి వరకు హీరోలు.. ఇప్పుడు అలియా భట్....

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో శరవేగం గా సాగుతుంది. అయితే ఈ పాటికే సగం షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ అనేక కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. మొదట్లో అనుకున్నట్టు గా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తర్వాత స్లో అయిపోయారు. అయితే మొదటగా […]

మొన్నటి వరకు హీరోలు.. ఇప్పుడు అలియా భట్....
X

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో శరవేగం గా సాగుతుంది.

అయితే ఈ పాటికే సగం షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ అనేక కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. మొదట్లో అనుకున్నట్టు గా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తర్వాత స్లో అయిపోయారు.

అయితే మొదటగా రామ్ చరణ్ కి అయిన గాయం కారణం గా ఈ సినిమా షూటింగ్ వడోదర లో నిలిచిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కి కూడా గాయం అవ్వడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయింది.

అయితే మెల్ల మెల్ల గా షూటింగ్ స్పీడ్ అందుకుంటుంది అనుకొనే సమయంలో ఇప్పుడు అనుకోని విధంగా సినిమా హీరోయిన్ అలియా భట్ వల్ల షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.

అయితే అలియా భట్ బ్రహ్మాస్త్ర అనే హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉండగా… తనకి జ్వరం వచ్చింది అని, అందుకే తను ఈ తెలుగు సినిమా కి సరిగా అందుబాటు లో ఉండడం లేదు అని, దాని వలన షూటింగ్ ఆలస్యం అవుతుంది అని తెలుస్తోంది.

First Published:  21 Jun 2019 12:34 AM GMT
Next Story