Telugu Global
Cinema & Entertainment

కీర్తిసురేష్ కు అంత సీన్ లేదు

హీరోలపై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్న శ్రీరెడ్డి, తాజాగా కీర్తిసురేష్ పై కూడా విరుచుకుపడింది. దర్శకులు లేకపోతే ఆమె లేదని, ఆమెను పెద్ద నటిగా చూడాల్సిన అవసరం లేదని అంటోంది. ప్రస్తుతం బరువు తగ్గిన కీర్తిసురేష్, పేషెంట్ లా తయారైందని సెటైర్లు వేసింది శ్రీరెడ్డి. “కీర్తిసురేష్, నేను ఒకే విమానంలో వెళ్తున్నాం. ఎవరూ ఆమెను గుర్తించలేకపోయారు. కనీసం నేను కూడా గుర్తుపట్టలేకపోయాను. ప్రతి ఒక్కరు నాతోనే మాట్లాడారు. నన్ను సెల్ఫీలు అడిగారు. బరువు తగ్గిన తర్వాత […]

కీర్తిసురేష్ కు అంత సీన్ లేదు
X

హీరోలపై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్న శ్రీరెడ్డి, తాజాగా కీర్తిసురేష్ పై కూడా విరుచుకుపడింది. దర్శకులు లేకపోతే ఆమె లేదని, ఆమెను పెద్ద నటిగా చూడాల్సిన అవసరం లేదని అంటోంది. ప్రస్తుతం బరువు తగ్గిన కీర్తిసురేష్, పేషెంట్ లా తయారైందని సెటైర్లు వేసింది శ్రీరెడ్డి.

“కీర్తిసురేష్, నేను ఒకే విమానంలో వెళ్తున్నాం. ఎవరూ ఆమెను గుర్తించలేకపోయారు. కనీసం నేను కూడా గుర్తుపట్టలేకపోయాను. ప్రతి ఒక్కరు నాతోనే మాట్లాడారు. నన్ను సెల్ఫీలు అడిగారు. బరువు తగ్గిన తర్వాత ఆమె పేషెంట్ లా తయారైంది. మహానటి అనేది దర్శకుడి ప్రతిభ, కీర్తిసురేష్ గొప్పదనం కాదు. కీర్తి మీద సాయిపల్లవి చాలా బెస్ట్.”

ఇలా కీర్తిసురేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఇకనైనా ఆమెను మహానటిగా చూడడం మానేయాలని, అందరి హీరోయిన్లలానే తను కూడా ఓ అమ్మాయి మాత్రమేనని, పైగా బరువు తగ్గిన తర్వాత మరింత కళావిహీనంగా మారిందని అంటోంది శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కీర్తిసురేష్ ఫ్యాన్స్ భగ్గుంటున్నారు. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై విరుచుకుపడుతున్నారు ఆమె ఫ్యాన్స్.

First Published:  19 Jun 2019 8:15 PM GMT
Next Story