Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా మొదలుపెట్టాడు

మొన్నటివరకు సినీ నిరుద్యోగిగా ఉన్న రాజ్ తరుణ్ ఇప్పటికే ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మరో మూవీ కూడా మొదలుపెట్టాడు. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ చేయబోయే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. హీరో లేకుండానే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల పాటు ఉంటుంది. ఆ […]

మరో సినిమా మొదలుపెట్టాడు
X

మొన్నటివరకు సినీ నిరుద్యోగిగా ఉన్న రాజ్ తరుణ్ ఇప్పటికే ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మరో మూవీ కూడా మొదలుపెట్టాడు. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ చేయబోయే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. హీరో లేకుండానే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని, ఆగస్ట్ నుంచి ఈ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ హీరో. నాన్ స్టాప్ షూటింగ్ తో, షెడ్యూల్స్ తో ఈ సినిమాను పూర్తిచేయబోతున్నారు.

ప్రస్తుతానికి హీరో మాత్రమే ఫిక్స్ అయ్యాడు. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. గతంలో విజయ్ కుమార్ సినిమాలకు సంగీతం అందించిన అనూప్ రూబెన్స్, ఈ కొత్త సినిమాకు కూడా ట్యూన్స్ అందించబోతున్నాడు.

First Published:  19 Jun 2019 8:02 PM GMT
Next Story