Telugu Global
NEWS

కోమటిరెడ్డి ని ఇలా దారికి తెచ్చుకున్నారా?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆది నుంచి వ్యతిరేకిస్తూ గ్రూపుగా ఉంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరబోతున్నట్టు కూడా చూచాయగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీ స్పందించింది లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, కార్యకలాపాలపై సీరియస్ గా స్పందించింది. షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇక టీపీసీసీ […]

కోమటిరెడ్డి ని ఇలా దారికి తెచ్చుకున్నారా?
X

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆది నుంచి వ్యతిరేకిస్తూ గ్రూపుగా ఉంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరబోతున్నట్టు కూడా చూచాయగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీ స్పందించింది లేదు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, కార్యకలాపాలపై సీరియస్ గా స్పందించింది. షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోమటిరెడ్డి పార్టీ మార్పుపై స్పందించారు. రాజకీయ కారణాలతోనే కోమటిరెడ్డి వెళుతుంటే చెప్పొచ్చని.. కానీ ఆర్థికపరమైన కారణాలతో వెళుతున్న కోమటిరెడ్డికి ఏం చెప్పగలమని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు బీజేపీలోకి వెళ్తున్నారో తనకు చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఆర్థిక కారణాలతోనే బీజేపీలో కోమటిరెడ్డి చేరుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం ఆసక్తిగా మారింది. తెలంగాణ రాష్ట్రసమితిని కాచుకొని తెలంగాణలో నిలబడ్డ వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ముఖ్యులు. అయితే ఇప్పుడు బీజేపీ ధాటికి వీరు ఆపరేషన్ ఆకర్ష్ లో చేరబోతున్నట్టు అర్థమవుతోంది.

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ ను వీడను అంటున్నాడు. మరి తమ్ముడు బీజేపీలో.. అన్న కాంగ్రెస్ లోనే ఉంటాడా? ఇద్దరు ఒకే దారి చూసుకుంటారా? అన్నది వేచిచూడాలి.

First Published:  20 Jun 2019 6:26 AM GMT
Next Story